హరికి వెనక ఉన్నవి కన్పించవా?

సబ్బం హరి. విశాఖ జిల్లాలో పాత త‌రం రాజకీయ నాయకుడు. ఆయన1980 దశకాల్లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విశాఖలో అప్పటికే రాజకీయ దిగ్గజం అయిన [more]

Update: 2021-03-22 12:30 GMT

సబ్బం హరి. విశాఖ జిల్లాలో పాత త‌రం రాజకీయ నాయకుడు. ఆయన1980 దశకాల్లో యువజన కాంగ్రెస్ నాయకుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. విశాఖలో అప్పటికే రాజకీయ దిగ్గజం అయిన ద్రోణంరాజు సత్యనారాయణకు వ్యతిరేక వర్గంగా ఉండే సీనియర్ నేతలకు అనుచరుడిగా ఉండేవారు. దివంగతులైన మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి ముఖ్య అనుచరుడిగా తన పొలిటికల్ కెరీర్ ఆరంభించి అనూహ్యంగా విశాఖకు మేయర్ అయ్యారు.

అలా జాక్ పాట్ ….

1994లో ఉమ్మడి ఏపీలో బంపర్ మెజారిటీ సాధించిన ఎన్టీఆర్ ఆ ఊపు ఉండగానే స్థానిక ఎన్నికలు పెట్టించారు. కేవలం రెండు నెలల తేడాతో ఎన్నికలు అంటే కచ్చితంగా ఓడిపోతామని ఆనాడు చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేయర్ గా పోటీకి వెనకంజ వేశారు. దాంతో సబ్బం హరికి లక్కీ చాన్స్ వచ్చింది. ఇక టీడీపీ అతి ధీమాకు పోవడం, అభ్యర్ధి ఎంపికలో జరిగిన కొన్ని పొరపాట్లు కారణంగా ప్రత్యక్ష పద్ధతిలో మేయర్ అయి హరి జాక్ పాట్ కొట్టేసారు. ఆ తరువాత ఆయన అయిదేళ్ళ పాలనలో విశాఖ అభివృద్ధిని పక్కన పెడితే ఆయన మార్క్ దూకుడుతో కొన్ని వర్గాలకు కాంగ్రెస్ ని దూరం చేశారని చెబుతారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ కార్పొరేటర్లనే కిడ్నాప్ చేసిన కేసులో ఏకంగా అరెస్ట్ అయిన సబ్బం హరి మేయర్ గా చరిత్ర సృష్టించారు అని చెబుతారు.

లూప్ లైన్ లోనే ….

ఇక సబ్బం హరి కాంగ్రెస్ లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తూంటే పార్టీ ధిక్కార చర్యలకు పాల్పడి ఆరేళ్ళ పాటు పార్టీ బహిష్కరణకు గురి అయ్యారు. వైఎస్సార్, కేవీపీ రామచంద్రరావుల దయతో ఆయన ఆ బహిష్కరణ నుంచి బయటపడి 2009 ఎన్నికల నాటికి అనకాపల్లి ఎంపీ టికెట్ సంపాదించారు. అపుడు కూడా ఓ వైపు చిరంజీవి బావమరిది అల్లు అరవింద్, మరో వైపు టీడీపీ తరఫున ఒక పత్రికాధిపతి పోటీలో ఉంటే కాంగ్రెస్ గెలుపు అసాధ్యమనుకుని టికెట్ ఇచ్చారు. అయితే లక్కీగా సబ్బం హరి గెలిచి ఎంపీ అయిపోయారు. అదంతా వైఎస్సార్ గాలితోనే సాధ్యమైందని అంటారు. వైఎస్సార్ మరణించాక సబ్బం హరి జగన్ వైపుకు వచ్చారు. కానీ జగన్ తో ఇమడలేకపోయారు. తిరిగి 2019 నాటికి టీడీపీలో చేరి భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

గతం మరచి …..

ఇక సబ్బం హరి ఎక్కువగా సెటిల్మెంట్స్ చేస్తాడని చెబుతారు. ఆయన రాజకీయ నాయకుడిగా కంటే ఇలాగే జనాలకు పరిచయం. అయితే సబ్బం హరి ఇపుడు ప్రశాంత విశాఖ అంటున్నారు. నాన్ లోకల్ లీడర్స్ వద్దు అంటున్నారు. మరి ఆయన ఉన్న టీడీపీ నిండా వారే ఉన్న సంగతిని మరిచారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అదే విధంగా సబ్బం హరి తాను మేయర్ గా ఉన్నపుడు శాంతిభద్రతల విషయంలో నగరం ఎలా ఉందో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని కూడా అంటున్నారు. జనంలో ఏ మాత్రం బలం లేని సబ్బం హరి కేవలం టీడీపీ అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ అపర మేధావిగా తనను తాను భావించుకుంటున్నాడు అని విమర్శిస్తున్నారు.

టీడీపీలో లేరా ….?

విశాఖ రాజధానిని చంద్రబాబు అడ్డుకుంటే స్థానికుడు అయిన సబ్బం హరి విశాఖ ప్రగతి విషయంలో ఎందుకు మాట్లాడరు అని మంత్రి అవంతి శ్రీనివాస్ నిలదీశారు. సబ్బం హరివి డబ్బా కబుర్లని, ఆయన్ పుట్టిన భీమిలీలోనే వైసీపీకి జనం పట్టం కట్టారని కూడా అవంతి సెటైర్లు వేస్తున్నారు. నాన్ లోకల్ లీడర్లను టోటల్ గా విశాఖ మీదకు తెచ్చిన టీడీపీకి రాజీనామా చేసి సబ్బం హరి మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు. మొత్తానికి ఏది ఎలా ఉన్నా హరి కధలు ఈనాటి జనం వింటారా ఆయన పేరు పక్కన మాజీ మేయర్, మాజీ ఎంపీ అని తగిలించుకున్నా కూడా ఇప్పటితరంలో ఎవరికి తెలుసు అన్న వారూ ఉన్నారు. జగన్ మీద వ్యక్తిగత కక్షతోనే సబ్బం హరి ఇలాంటి కధలను చెబుతున్నారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు.

Tags:    

Similar News