స్నేహం బయటకేనా? నిర్ణయాలు నచ్చే అవకాశం లేదా?

మహారాష్ట్రలో ఏ రూపంలోనైనా ఎప్పుడైనా ముప్పు ముంచుకు వచ్చే ప్రమాదముందని పిస్తోంది. భిన్న అభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలతో ఉన్న పార్టీలు కూటమిగా ఏర్పడటమే ఇందుకు కారణం. మహారాష్ట్రలో [more]

Update: 2020-07-26 18:29 GMT

మహారాష్ట్రలో ఏ రూపంలోనైనా ఎప్పుడైనా ముప్పు ముంచుకు వచ్చే ప్రమాదముందని పిస్తోంది. భిన్న అభిప్రాయాలు, విభిన్న సిద్ధాంతాలతో ఉన్న పార్టీలు కూటమిగా ఏర్పడటమే ఇందుకు కారణం. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న కూటమిలో ప్రతి విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరి నిర్ణయం మరొకరు బహిరంగంగా తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా ఉద్ధవ్ థాక్రే తీసుకునే నిర్ణయాలను సయితం కూటమిలోని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం విశేషం.

లాక్ డౌన్ మినహాయింపుల్లోనూ…..

కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండటంతో లాక్ డౌన్ మినహాయింపుల విషయంలోనూ శివసేన, ఎన్సీపీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పై కొన్ని వ్యాపార సంస్థల నుంచి వత్తిడి పెరగడంతో ఆయన వాటికి లాక్ డౌన్ మినహాయింపులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. కూటమిలోని పార్టీల అభిప్రాయం తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఎన్సీపీ నుంచి శివసేనకు పరోక్ష వార్నింగ్ లు వెళ్లాయి.

భూమి పూజ విషయంలో….

ఇక తాజాగా రామమందిర భూమి పూజ మరోసారి రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా చేసింది. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ తో సహా అందరూ హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమే ఇప్పుడు శివసేన, ఎన్సీపీల మధ్య వివాదం తలెత్తేలా చేసింది.

మతపరమైన కార్యక్రమాలకు….

మత పరమైన కార్యక్రమాలకు ఎలా వెళ్తారని ఎన్సీపీ ప్రశ్నిస్తుంది. వెళ్లి తీరతామని శివసేన ప్రకటించింది. నిజానికి శివసేన పక్కా హిందుత్వ పార్టీగానే ఉంది. అది తన సిద్ధాంతాలను మార్చుకునే అవకాశం లేదు. మరోవైపు సెక్యులర్ పార్టీలుగా కూటమిలోని కాంగ్రెస్, ఎన్సీపీలు ఉన్నాయి. దీంతో రామాలయం భూమి పూజ కూటమిలో చిచ్చుపెట్టే అవకాశముంది. అయితే అది ఉద్ధవ్ థాక్రే వ్యక్తిగత వ్యవహారమని, దీనికి పట్టించుకోవాల్సిన అవసరం లేదని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News