తగ్గను… వెనుకడుగు వేయం

ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు ప్రకటించినట్లుగానే సమ్మెను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే దూరప్రాంతాలకు చెందిన బస్సులను నిలిపివేశారు. తెల్లవారుజాము బయలుదేరాల్సిన బస్సులన్నీ ఎక్కడి డిపోల్లో అక్కడ [more]

Update: 2019-10-05 11:34 GMT

ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో ఆర్టీసీ కార్మికులు ప్రకటించినట్లుగానే సమ్మెను కొనసాగిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే దూరప్రాంతాలకు చెందిన బస్సులను నిలిపివేశారు. తెల్లవారుజాము బయలుదేరాల్సిన బస్సులన్నీ ఎక్కడి డిపోల్లో అక్కడ నిలిచిపోయాయి. దీంతో ఇటు ప్రభుత్వం… అటు ఆర్టీసీ కార్మికుల మధ్య ఊళ్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఉసూరు మంటున్నారు.

ముందు నుంచి చెబుతున్నాం….

నెలరోజుల ముందే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మెపై జేఏసీ నోటీసు ఇచ్చింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్ తో పాటు మరో 5 సమస్యలను నోటీసులో జేఏసీ నేతలు వివరించారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో సెప్టెంబర్ 25 తరువాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతామని అల్టిమేటం కూడా జారీ చేశారు. అయినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. అక్టోబర్ 5 నుంచి సమ్మె చేస్తామని పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడిగా ముగ్గురు ఐపీఎస్ అధికారులతో కమిటీవేసింది. ఆ కమిటీతో మూడు దఫాలుగా చర్చలు జరిపినా ఫలించలేదు. దీంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లిపోయారు.

ఇదేం తీరు…..

ఢిల్లీ నుంచి వచ్చిన సీఎం కేసీఆర్ సమ్మె చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేటు బస్సులను పెట్టి పండగకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేయాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఉద్యోగులు ఇవ్వాళ విధులకు హాజరుకాకపోతే కొత్తవారిని నియమిస్తామని హెచ్చరికలు జారీచేశారు. బస్సులు నడిచేందుకు తాత్కాలిక పర్మిట్లు కూడా జారీ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

కేసీఆర్ మాట తప్పారు……

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మికుల్లో ఎంతో భరోసా నింపిన కేసీఆర్ ఇవ్వాళ మాటతప్పారని ఆర్టీసీ కార్మికనేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాడో మాట… ఇవ్వాలో మాట ఇదేనా కేసీఆర్ తీరంటూ ధ్వజమెత్తుతున్నారు. ఎన్ని ఉక్కుపాదాలు మోపినా, ఎస్మా ను ప్రయోగించినా వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో ఏం చేయాలో రెండు రోజుల షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.

రేపు అనగా 6న 9గంటలకు ఉదయం అన్నిరాజకీయ పార్టీల వారిని కలిసి మద్దతు కోరుతూ వినతి పత్రాలు ఇస్తారు.

6న ఉదయం 11 లకు సుందరయ్య కేంద్రంలో ట్రేడ్ యూనియన్ల సమావేశం

6న సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు మహిళా ఉద్యోగులు వారి కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తారు.

7వ తేదీన ఉదయం 8గంటలకు గన్ పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు

7న ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కు వద్ద నిరాహార దీక్షలు

 

 

Tags:    

Similar News