రౌతుకు ఇక ఆశలు లేనట్లేనా? తప్పుకున్నారా?

వైసీపీలో తొలి నుంచి ఉన్న రౌతు సూర్యప్రకాశరావును జగన్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే నంటున్నారు. ఆయనకు ఇక పార్టీలోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ ఎటువంటి ప్రాధాన్యత ఉండదని తేల్చేశారు. [more]

Update: 2020-09-10 05:00 GMT

వైసీపీలో తొలి నుంచి ఉన్న రౌతు సూర్యప్రకాశరావును జగన్ పూర్తిగా పక్కన పెట్టేసినట్లే నంటున్నారు. ఆయనకు ఇక పార్టీలోనూ, ప్రభుత్వ పదవుల్లోనూ ఎటువంటి ప్రాధాన్యత ఉండదని తేల్చేశారు. రౌతు సూర్యప్రకాశరావు కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చారు. జగన్ వెంట నడిచారు. రెండుసార్లు రౌతు సూర్యప్రకాశరావు విజయం సాధించారు. 2004, 2009 లో ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆతర్వాత నుంచి ఆయన డౌన్ ఫాల్ స్టార్టయింది.

టిక్కెట్ ఇస్తామన్నా…..

2014 ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాశరావు స్వచ్ఛందంగానే టిక్కెట్ వద్దనుకున్నారు. జగన్ పార్టీ టిక్కెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రౌతు సూర్యప్రకాశరావు మాత్రం టిక్కెట్ ను నిరాకరించారు. దీంతో అక్కడ బొమ్మన రాజకుమార్ కు వైసీపీ టిక్కెట్ ఇచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలయింది. అదే రౌతు సూర్యప్రకాశరావు చేసిన తప్పు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు చేరువయిన రౌతు సూర్యప్రకాశరావు పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో క్యాడర్ మొత్తం చేజారిపోయింది.

ఓటమి తర్వాత….

దీంతో 2019 ఎన్నికల్లో రౌతు సూర్యప్రకాశరావు మళ్లీ వైసీపీ నుంచి పోటీ చేశారు. అయితే ఈసారి ఆయన గెలవలేదు. ఆదిరెడ్డి భవానీ చేతిలో ఓటమి పాలయ్యారు. నిజానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైసీపీ గెలుస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ ఐదేళ్లు కార్యకర్తలకు దూరం కావడంతో రౌతు సూర్యప్రకాశరావుకు అపజయం తప్పలేదు. అప్పటి నుంచి వైసీపీ హైకమాండ్ రౌతు సూర్యప్రకాశరావును పక్కన పెట్టిందనే చెప్పాలి.

పూర్తిగా దూరం….

ఆయన స్థానంలో రాజమండ్రి సిటీ ఇన్ ఛార్జిగా శిఖాకొల్లును అధిష్టానం నియమించింది. దీంతో రౌతు సూర్యప్రకాశరావు సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకూ దూరంగా ఉంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఆయన వల్ల పార్టీకి ప్రయోజనం భవిష్యత్ లోనూ ఏమీ లేదని గుర్తించింది. అందుకే నామినేటెడ్ పదవుల్లోనూ రౌతు సూర్యప్రకాశరావు పేరు విన్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రౌతు సూర్యప్రకాశరావు ఇక పార్టీ నుంచి, రాజకీయాలనుంచి తప్పుకున్నట్లే నని అంటున్నారు.

Tags:    

Similar News