రోహిత్ నీకు ఎదురే లేదు…!!

ప్రపంచ కప్ క్రికెట్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓవరాల్ టాప్ స్కోరర్ స్థానానికి చేరుకున్నాడు. [more]

Update: 2019-07-03 02:30 GMT

ప్రపంచ కప్ క్రికెట్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఓవరాల్ టాప్ స్కోరర్ స్థానానికి చేరుకున్నాడు. తాజా వరల్డ్ కప్ లో నాలుగో సెంచరీ నమోదు చేసి మరో రికార్డ్ నెలకొల్పిన రోహిత్ ఇప్పటివరకు టోర్నీ లో హైయెస్ట్ స్కోరర్స్ గా సాగుతున్న వారందరిని కిందకు దించి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ప్రపంచ కప్ మొదలైన నాటినుంచి నేటి వరకు తన సూపర్ ఫామ్ తో క్రీడాభిమానులను అలరిస్తున్న రోహిత్ ఆడిన 8 మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు నమోదు చేయడం విశేషం. శ్రీలంక స్టార్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర ప్రపంచ కప్ లో సాధించిన నాలుగు శతకాల రికార్డ్ ను అందుకున్న రెండో ఆటగాడిగా రికార్డ్ కెక్కాడు.

వీరి మధ్యే పోటీ …

ఈ ప్రపంచ కప్ టోర్నీ లో టాప్ స్కోరర్ గా నిలిచేవారి నడుమ పోటీ తీవ్రంగానే వుంది. టీం ఇండియా స్టార్ రోహిత్ శర్మ తాజాగా 544 పరుగుల తో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా ప్రస్తుతం వున్నారు. ఆయన వెనుకే బాంగ్లాదేశ్ ఆలిరౌండర్ షకీబ్ 542 పరుగులతో నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా ఆటగాళ్ళు డేవిడ్ వార్నర్ 516 పరుగులతోను , ఆరోన్ పించ్ 504 పరుగులతో నిలువగా ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జోయ్ రూట్ 476 పరుగులతో టాప్ స్కోరర్స్ రేసులో దూసుకుపోతున్నారు.

దూసుకుపోతూ….

ప్రస్తుతం ప్రపంచ కప్ పోటీలలో అన్ని జట్లు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడనున్నాయి. ఆస్ట్రేలియా, ఇండియా లు సెమిస్ చేరుకోవడంతో ఈ రెండు టీం ల ఆటగాళ్ళు రెండేసి మ్యాచ్ లు ఖచ్చితంగా ఆడే వీలుంటుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ, వార్నర్, పించ్ లలో ఒకరు టాప్ స్కోరర్ గా రికార్డ్ నమోదు చేసే అవకాశాలు వున్నాయి. ఇంగ్లాండ్ సెమిస్ చేరితే మాత్రం జోయ్ రూట్ కి ఇంకా ఛాన్స్ ఉంటుంది. మరి వీరిలో ఆ ఫీట్ అందుకునేది ఎవరో ?

Tags:    

Similar News