భీకర ఫామ్ తో కోహ్లీ కి ఎసరు పెడుతున్న రోహిత్ ?

ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ ఎవరు ? ఈ రేసులో ఇప్పటివరకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీకి ఇప్పుడు వైస్ [more]

Update: 2019-07-08 03:03 GMT

ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ ఎవరు ? ఈ రేసులో ఇప్పటివరకు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీకి ఇప్పుడు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి గట్టి సవాల్ ఎదురౌతుంది. భీకరమైన ఫామ్ తో ప్రపంచ కప్ టోర్నీ లో ఐదు సెంచరీలతో చెలరేగిపోతున్న రోహిత్ ప్రపంచ మేటి బ్యాట్స్ మెన్ జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ – రోహిత్ ల నడుమ ఇప్పుడు కేవలం ఆరుపాయింట్ల తేడా మాత్రమే వుంది. ఐసిసి తాజాగా విడుదల చేసిన ర్యాంక్ లతో తాజా చర్చ మొదలైంది.

ఆరుపాయింట్ల తేడానే …

నిన్నమొన్నటివరకు 51 పాయింట్ల తేడా విరాట్ – రోహిత్ ల నడుమ ఉండేది. అయితే అత్యుత్తమ ఆటతీరుతో రోహిత్ ఇప్పటికే వరల్డ్ కప్ టోర్నీ లో 647 పరుగులు సాధించి నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే ఫామ్ తో సెమిస్ లో కూడా రోహిత్ శర్మ చెలరేగితే నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ స్థానం దక్కించుకునే అవకాశాలు మెండుగా వున్నాయి. అయితే కోహ్లీ ఈ స్థానం దూరం చేసుకోవడానికి సిద్ధంగా లేడు.

నువ్వా నేనా ….

రోహిత్ తో పోటీ కి తన ఫామ్ తో జవాబు చెప్పడానికి ఏమాత్రం తగ్గే పరిస్థితి లేదంటున్నారు విశ్లేషకులు. రోహిత్ కి ఓపెనర్ గా వున్న అవకాశాలు ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కి దిగే విరాట్ కి తక్కువ ఉంటాయి. దానితో బాటు సారధ్య బాధ్యతలు కోహ్లీ పై వత్తిడి పెంచుతాయి. అదే వైస్ కెప్టెన్ కి వత్తిడి పెద్దగా ఉండదు. ఈ నేపథ్యంలో రోహిత్ ప్రపంచ కప్ తరువాత కూడా ఇదే ఫామ్ లో ఉంటే కోహ్లీ ని రెండో స్థానానికి తోసేసే ఛాన్స్ లేకపోలేదంటున్నారు క్రీడా విశ్లేషకులు. చూడాలి టీం ఇండియా రధసారధి రోహిత్ తో తన ర్యాంక్ సమరం లో నిలుస్తారో లేదో.

Tags:    

Similar News