బౌలింగ్ వీరులపై బ్యాటింగ్ వీరుల ధమాకా … రికార్డ్ కాపాడిన కోహ్లీ సేన
పాకిస్థాన్ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా ప్రత్యర్థుల వికెట్లను కుప్పకూల్చడంలో వారికి వారే సాటి. ఇంగ్లీష్ [more]
పాకిస్థాన్ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా ప్రత్యర్థుల వికెట్లను కుప్పకూల్చడంలో వారికి వారే సాటి. ఇంగ్లీష్ [more]
పాకిస్థాన్ బౌలింగ్ అటాక్ ను ఎదుర్కోవడం అంత ఆషామాషీ కాదు. ఫాస్ట్ బౌలింగ్ అయినా స్పిన్ అయినా ప్రత్యర్థుల వికెట్లను కుప్పకూల్చడంలో వారికి వారే సాటి. ఇంగ్లీష్ గడ్డపై జరుగుతున్న ప్రపంచకప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఇంగ్లాండ్ ను తన పదునైన బౌలింగ్ వనరులతో దెబ్బకొట్టి 14 పరుగుల తేడాతో విజయం సాధించింది పాకిస్థాన్. అయితే ఏ రోజు ఎలా ఆడుతుందో తెలియని టీం గా ఖ్యాతి గాంచిన పాక్ తన అమ్ముల పొదిలో వున్న అస్త్రాలన్నీ వాడినా భారత్ బ్యాటింగ్ దెబ్బకు తాజాగా కుదేలయింది. భీకర ఫామ్ లో వున్న రోహిత్ శర్మ కు అండగా కెఎల్ రాహుల్ నిలవడంతో పాక్ బౌలర్ల పప్పులు ఉడకలేదు.
టాప్ ఆర్డర్ సక్సెస్ తో ….
టాస్ ఒడి బ్యాటింగ్ కు దిగిన టీం ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 336 పరుగులు సాధించింది. టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ పాక్ బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడి మైదనాం నలుమూలలా 14 ఫోర్లు, మూడు సిక్సర్లతో 113 బంతుల్లో 140 పరుగులు చేశాడు. ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ కి ఇది మూడో సెంచరీ కాగా, తాజా టోర్నీలో రెండవ సెంచరీ కావడం విశేషం. తొలి వికెట్ కు కె ఎల్ రాహుల్ తో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని టీం ఇండియా నమోదు చేయడంతో భారీ స్కోర్ కి పునాది పడిపోయింది. రాహుల్ (57) తొలి వికెట్ గా వెనుతిరిగాకా కెప్టెన్ విరాట్ కోహ్లీ రంగంలోకి దిగి పాక్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 65 బంతుల్లో 77 పరుగులు సాధించి వన్డేల్లో అరుదైన రికార్డ్ అధిగమించాడు. 276 ఇన్నింగ్స్ లో 11 వేల పరుగులు సాధించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డ్ ను కేవలం 222 ఇన్నింగ్స్ లో దాటి ప్రపంచ క్రికెట్ లో ఈ ఘనత సాధించిన 9 వ ఆటగాడిగా రికార్డ్ నమోదు చేశాడు. ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు సాధించిన టీం ఇండియా పాక్ ముందు 337 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ తురుపు ముక్క అమీర్ మూడు వికెట్లు తీయగా వాహబ్ రియాజ్, హాసన్ ఆలీ భారీగా పరుగులు సమర్పించుకుని చెరోవికెట్ దక్కించుకున్నారు.
పునాది గట్టిగా వేసినా ….
భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాక్ ఓపెనర్లు గట్టి పునాదే టీం కి వేశారు. ఫకర్ జమాన్ (62) బాబర్ అజాం (48) సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసినా తరువాత వచ్చిన బ్యాట్సమెన్ భారత బౌలర్ల ధాటికి చేతులు ఎత్తేయడంతో మ్యాచ్ ను చేజార్చుకున్నారు. డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం పాక్ 40 ఓవర్లలో 302 పరుగులు చేయాలిసి వచ్చింది. దాంతో ఫకర్, బాబర్ లు వెనుతిరిగాక మహ్మమద్ హఫీజ్, సర్పరాజ్, షోయబ్ మాలిక్ లు క్యూ కట్టేయడంతో లక్ష్యాన్ని ఛేదించే మొనగాడే లేకుండా పోయాడు. భువనేశ్వర్ రిటైర్డ్ హార్ట్ తో బౌలింగ్ కి వచ్చిన విజయ శంకర్ తొలి బంతికే వికెట్ సాధించి ప్రపంచ కప్ లో మరో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. ఇక కులదీప్, హార్దిక్ పాండ్య లు పాక్ టాప్ ఆర్డర్ మిడిలార్డర్ ను కుప్పకూల్చారు. చివరిలో ఇమాద్ వసీం (46) ధాటిగా ఆడినా ఛేదించాలిసిన లక్ష్యం భారీగా పెరిగిపోయి నిర్దేశిత ఓవర్లు పరిసమాప్తం అయిపోయి టీం ఇండియా మరో చారిత్రక విజయాన్ని నమోదు చేసి టోర్నీలో ముందుకు దూసుకుపోయింది. అద్భుత బ్యాటింగ్ తో అలరించిన రోహిత్ శర్మ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.