Tdp : స్క్రిప్ట్ ….స్కెచ్.. డైరెక్షన్ ఈయనది…యాక్టింగ్ వారిది

తెలుగుదేశం పార్టీ వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయి. స్కెచ్ లు పక్కాగా అమలవుతున్నాయి. ఫలితంగా నిస్తేజంగా ఉన్న నేతలు, క్యాడర్ లో ఉత్తేజం నెలకొంది. గత కొద్ది నెలలుగా [more]

Update: 2021-10-23 03:30 GMT

తెలుగుదేశం పార్టీ వ్యూహాలు సక్సెస్ అవుతున్నాయి. స్కెచ్ లు పక్కాగా అమలవుతున్నాయి. ఫలితంగా నిస్తేజంగా ఉన్న నేతలు, క్యాడర్ లో ఉత్తేజం నెలకొంది. గత కొద్ది నెలలుగా తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలకు తెర వెనక సూత్రధారి రాబిన్ శర్మ. ఈయన వేసిన స్కెచ్ ప్రకారమే పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ నడుచుకుంటున్నారు. వాటిన అమలు పరుస్తున్నారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచే….

తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా చంద్రబాబు నియమించుకున్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో రాబిన్ శర్మకు ప్రత్యేకంగా కార్యాలయాన్ని కేటాయించారు. గత ఆరు నెలలుగా సర్వేల కోసం వివిధ విద్యాసంస్థల నుంచి విద్యార్థులను నియమించుకునే పనిలో రాబిన్ శర్మ ఉన్నారు. ఆయన హైదరాబాద్ నుంచే ఏపీలో ఏ ఏ అంశాలపై పార్టీ ఆందోళనలు చేయాలన్నది నిర్ణయిస్తున్నారు.

నెగిటివ్ పద్ధతిలోనే..

ప్రజల్లోకి పాజిటివ్ లో వెళితే తొందరగా వెళ్లలేం. అదే నెగిటివ్ అయితే త్వరగా వెళ్లే అవకాశముంది. రాబిన్ శర్మ అదే నెగిటివ్ పద్ధతిలో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. డ్రగ్స్ వ్యవహారాన్ని, గంజాయి అక్రమ రవాణాతో ప్రజల్లోకి వెళ్లాలన్నది రాబిన్ శర్మ ప్లాన్. పట్టాభి ఆ పదం ఉపయోగించడానికి కూడా రాబిన్ శర్మ కారణమంటున్నారు. ఆయన చెప్పినట్లే పట్టాభి ప్రకటన చేయడంతో వైసీపీని రెచ్చగొట్టినట్లయింది. దీంతో పాటు వైసీపీని రెచ్చగొట్టి దాడులు జరిగితే దాని నుంచి సానుభూతిని పొందే ప్రయత్నమూ రాబిన్ శర్మ ఆలోచనల నుంచి వచ్చిందేనని అంటున్నారు.

ప్రతి అంశాన్ని…..

రాష్ట్ర టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై వెంటనే గవర్నర్ తో పాటు ప్రధాని, అమిత్ షా, రాష్ట్రపతికి లేఖలు రాయడం, బాబు 36 గంటల దీక్ష, ఢిల్లీ టూర్ వంటివి కూడా రాబిన్ శర్మ రచించినవే. సో… తెలుగుదేశం పార్టీలో రాబిన్ శర్మ ఇప్పుడు కీలకంగా మారారు. టీడీపీ సోషల్ మీడియా కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయింది. రాబిన్ శర్మ నేతృత్వలోని టీం సోషల్ మీడియా వ్యవహారాలను చూస్తున్నట్లు చెబుతున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంలో ఉన్న రాబిన్ శర్మ ఆలోచనలనే చంద్రబాబు అమలు చేస్తున్నారు. రానున్న కాలంలో రాబిన్ మరెన్ని స్కెచ్ లు వేస్తారన్నది చూడాలి.

Tags:    

Similar News