చైన్ కట్ చేశామనుకుంటే.. వీళ్లు కలుపుతున్నారే?

వైరస్ కట్టడికి అన్ని దారులు మూసేసి చైన్ కట్ చేద్దామన్నది ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న భగీరథ ప్రయత్నం. అయితే ఇప్పుడు కొందరు చదువుకున్న మూర్ఖులే ఈ చైన్ [more]

Update: 2020-04-24 11:00 GMT

వైరస్ కట్టడికి అన్ని దారులు మూసేసి చైన్ కట్ చేద్దామన్నది ప్రభుత్వాలు, ప్రజలు చేస్తున్న భగీరథ ప్రయత్నం. అయితే ఇప్పుడు కొందరు చదువుకున్న మూర్ఖులే ఈ చైన్ మరింత పెరిగేలా చేస్తూ దడపుట్టిస్తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో ఉండే ఆర్ ఎం పి, పిఎంపి వైద్యులు కరోనా వచ్చిన పాజిటివ్ కేసుల్లో తెలిసో, తెలియకుండానే వైద్యం అందించి వారితో పాటు వైరస్ అంటించుకుంటున్నారు. వైద్యుల ఇమ్యూనిటీ కారణంగా వారికీ ఇన్ఫెక్షన్ సోకిందని తెలియక తమ వైద్యం కొనసాగించేస్తున్నారు. ఫలితంగా మరింత మందికి వైరస్ వెళ్ళిపోయి ఏపీ లో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. దీనివల్ల ఫ్రంట్ లైన్ లో తమ ప్రాణాలు ఫణంగా పెట్టి యుద్ధం చేస్తున్న వైద్యరంగంలో ఉన్న డాక్టర్లపై వత్తిడి తీవ్రంగా పెరిగిపోతుంది. మరోపక్క వైరస్ కట్టడి కోసం అహరం శ్రమిస్తున్న అధికార యంత్రాంగం, పోలీసులు మరింతగా నలిగిపోతున్నారు.

రాజమండ్రిలో, కత్తిపూడిలో …

కత్తిపూడిలో ఒక ఉపాధ్యాయుడు చేసిన నిర్వాకం సంగతి పక్కన పెడితే ఒక ఆర్ ఎం పి ఆయనకు వైద్యం చేయడంతో వైరస్ పలువురికి సోకింది. అదే సీన్ రాజమండ్రిలో రిపీట్ అయ్యింది. తబ్లీగి జమాత్ కి వెళ్లినవారిని కర్నూలు లో కలిసి గూడ్స్ రైలు ద్వారా రాజమండ్రి చేరుకున్న మహిళ అస్వస్థతకు గురైతే ఆర్ ఎం పి వైద్యం చేశారు. ఆమె తరువాత ఆయన మరో 70 మందిని కలిశారు. ఆర్ ఎం పి కి పాజిటివ్ రావడంతో 70 మందిని క్వారంటైన్ చేయాలిసి వచ్చింది. ఈ లింక్ ద్వారా ఇప్పుడు రాజమండ్రి నెహ్రు నగర్, కొంతమూరు జండా పంజా రోడ్డు వంటి చోట మరికొందరికి పాజిటివ్ రావడం తో గోదావరి తీరం ఉలిక్కి పడింది. ఈ కేసులన్నిటితో రాజమండ్రిలో 19 పాజిటివ్ లు నమోదు అయ్యాయి.

రాజమండ్రి వణుకుతుంది ….

జిల్లాల్లో మొత్తం 32 ఉంటే అందులో రాజమండ్రిలో 19 కావడంతో ప్రశాంత నగరంలో అశాంతి మొదలైంది. ఈ చైన్ ఎక్కడివరకు కేసుల సంఖ్యను తీసుకువెడుతుందన్న ఆందోళన అందరిలో ఇప్పుడు టెన్షన్ పెట్టేస్తుంది. దాంతో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు మొదలు పెట్టింది. వాస్తవానికి దగ్గు జ్వరం తో బాధపడే వారు ఎవరు వచ్చినా వారి వివరాలను దాచకుండా తక్షణం వైద్య అధికారులకు తెలియచేయాలి. అలా చేయకపోతే వారిపై చట్ట రీత్యా చర్యలు తప్పవు. కానీ దీన్ని ఆర్ ఎంపి లు ఇంకా తలకు ఎక్కించుకోలేదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వైద్యం చేస్తూ తమ ప్రాణాలమీదకు తెచ్చుకోవడంతో పాటు తోటి వారికి హానీ చేస్తున్నారు. అదే ఇప్పుడు సమాజానికి ప్రమాదంగా మారింది. ఇలాంటి వ్యవహారాలు అనేక జిల్లాల్లో ఆర్ ఎంపి లు వెలగబెడుతున్నట్లు తెలుస్తుంది. వీరిపై తక్షణం నిఘా పెంచకపోతే మాత్రం ఎపి లో వైరస్ కట్టడికి తీసుకునే చర్యలు బూడిదలో పోసిన పన్నీరే.

Tags:    

Similar News