రోజా “వేదన” కు ఫుల్ స్టాప్ పడేట్టు లేదుగా?

చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రధాన నేతల మధ్య జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కన్పించడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే [more]

Update: 2020-10-19 06:30 GMT

చిత్తూరు జిల్లాలో వైసీపీ ప్రధాన నేతల మధ్య జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కన్పించడం లేదు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాల మధ్య పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విభేదాలు తలెత్తాయి. పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు వీరి మధ్య పెద్దగా విభేదాలు లేవు. పవర్ లోకి రాగానే ప్రాబ్లమ్స్ స్టార్టయ్యాయి. తన నియోజకవర్గంలో వేలు పెడుతున్నారన్నది ఎమ్మెల్యే రోజా ప్రధాన ఆరోపణ. పెద్దిరెడ్డి వర్గం కూడా రోజా విషయంలో ఏమాత్రం తగ్గకూడదనే నిర్ణయించుకున్నట్లు కనపడుతుంది.

ఫలితాలు వచ్చిన నాటి నుంచే…..

ఎన్నికల ఫలితాలు రాగానే ఆర్కే రోజా తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ సామాజిక వర్గాల సమీకరణాల్లో భాగంగా రోజాకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోయారు. రోజా తన మనసులో ఏదీ దాచుకోరు. అందుకనే మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి కూడా రోజా అప్పట్లో హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ఆ తర్వాత జగన్ ను కలిసి మాట్లాడిన తర్వాత రోజా శాతించారు. ఆ తర్వాత జగన్ రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్ పదవి ఇచ్చి కొంత చల్లబర్చారు.

పెద్దిరెడ్డి ప్రమేయంతోనే…..

కానీ తన నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం జోక్యాన్ని మాత్రం రోజా సహించలేకపోతున్నారు. మంత్రి నారాయణస్వామి తనకు తెలియకుండా నియోజకవర్గంలో జరిపిన పర్యటనపై కస్సు బుస్సు లాడారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రోజాను శాంతింప చేసేందుకు భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామి ఆమె ఇంటికి వెళ్లి మరీ చర్చలు అప్పట్లో జరిపారు. అయితే రోజాకు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మధ్య రాజీ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని చెబుతున్నారు.

పట్టించుకోవడం లేదని….

తన శత్రువులను కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేరదీస్తున్నారని, వారికి పదవులను కట్టబెడుతున్నారని రోజా ఆరోపిస్తున్నారు. అనేకసార్లు పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని రోజా భావిస్తున్నారు. స్వయంగా తాను జగన్ కు వివరించినా ఫలితం లేకపోయిందన్నారు. తాను విపక్షంలో పడిన శ్రమను పార్టీ అధినాయకత్వం గుర్తించడం లేదని రోజా తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజాల మధ్య మాత్రం జరిగిన విషయాలను బట్టి చూస్తే సయోధ్య కష్టమేనని తెలుస్తోంది.

Tags:    

Similar News