మంత్రి పదవి రాకపోవడమే మంచిదయిందా?

నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు రోజురోజుకూ గ్రిప్ పెంచుకుంటూ ఉంది. టీడీపీ క్యాడర్ ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు [more]

Update: 2020-09-22 02:00 GMT

నగరి నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా కు రోజురోజుకూ గ్రిప్ పెంచుకుంటూ ఉంది. టీడీపీ క్యాడర్ ను పూర్తిగా తమ వైపునకు తిప్పుకునే పనిలో పడ్డారు ఆర్కేరోజా. ఆర్కే రోజాకు ఒకరకంగా మంత్రి పదవి రాకపోవడమే మంచిదయిందంటున్నారు ఆమె సన్నిహితులు, శ్రేయోభిలాషులు. మంత్రి పదవి వచ్చి ఉంటే నియోజకవర్గం గురించి పట్టించుకునే సమయం ఉండేది కాదని, ఇప్పుడు పూర్తిగా నగరి మీదనే దృష్టి పెడుతుండటంతో టీడీపీని దెబ్బకొట్టే అవకాశం చిక్కినట్లయిందంటున్నారు.

టీడీపీకి నేత లేకపోవడంతో…..

ఆర్కే రోజా నగరి నియోజకవర్గంలో రెండుసార్లు వరస విజయాలను నమోదు చేసుకున్నారు. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గాలి ముద్దు కృష్ణమనాయుడిపై నెగ్గిన ఆర్కే రోజా, 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో గాలి తనయుడు భాను ప్రకాష్ పై విజయం సాధించారు. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మరణంతో నగరి నియోజకవర్గంలో టీడీపీకి నేత అంటూ లేకుండా పోయారు. క్యాడర్ ను పట్టించుకునే వారు లేరు. ఇది ఆర్కే రోజా అడ్వాంటేజీగా మార్చుకుంటున్నారు.

వారసులు వేస్ట్ ….

గాలి ముద్దు కృష్ణమనాయుడు వారసులు ఉన్నప్పటికీ వారికి రాజకీయాలు అచ్చిరాలేదని చెప్పాలి. అచ్చిరాలేదనే కంటే వారే పాలిటిక్స్ ను వ్యాపారంగా మార్చుకోవడం వల్ల నష్టపోయారంటున్నారు. గాలి ముద్దు కృష్ణమనాయుడు మరణంతో కుటుంబంలో రాజకీయ వారసత్వం కోసం విభేదాలు తలెత్తాయి. చివరకు చంద్రబాబు పంచాయతీ చేసి గాలి జగదీష్ కు గత ఎన్నికల్లో సీటు ఇచ్చినా నెగ్గుకు రాలేకపోయారు. ఆర్కే రోజాపై ఓటమిపాలయ్యారు.

వరసగా కండువాలు కప్పేస్తూ…..

ఎన్నికల తర్వాత నుంచి గాలి జగదీష్ నియోజకవర్గంలో అందుబాటులో లేరు. ఆయన నియోజకవర్గంలో కంటే తిరుపతి, బెంగళూరులోనే ఎక్కువగా ఉంటున్నారు. దీంతో ఆర్కే రోజా టీడీపీ క్యాడర్ కు కండువాలు కప్పే పనిలో పడ్డారు. ఇటీవలే 41 టీడీపీ సానుభూతిపరులైన కుటుంబాలకు ఆర్కే రోజా పార్టీలోకి తీసుకొచ్చారు. అయితే సోషల్ మీడియాలో టీడీపీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు, లోకేష్ పట్టించుకోకుంటే నగరిలో టీడీపీ దుకాణం బంద్ అని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నగరిలో సగం టీడీపీ క్యాడర్ పార్టీని వీడి వెళ్లిందంటున్నారు.

Tags:    

Similar News