వారిపై రోజా ఆంక్షలు… మామూలుగా లేదుగా..?

ఆర్కే రోజా…. ఫైర్ బ్రాండ్… తాను అనుకున్నది జరగాలనుకుంటారు. తనపై ఎవరు ఆధిపత్యం ప్రదర్శించినా సహించరు. తనకు ఇష్టం లేకుంటే సన్నిహితులను కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తారు. [more]

Update: 2020-07-22 15:30 GMT

ఆర్కే రోజా…. ఫైర్ బ్రాండ్… తాను అనుకున్నది జరగాలనుకుంటారు. తనపై ఎవరు ఆధిపత్యం ప్రదర్శించినా సహించరు. తనకు ఇష్టం లేకుంటే సన్నిహితులను కూడా పూర్తిగా పక్కన పెట్టేస్తారు. అయితే కొన్నాళ్లుగా నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీ నేతలపై ఆగ్రహంతో ఉన్నారు. తనను అనవసరంగా కెలుకుతున్నారని ఫైర్ అవుతున్నారు. ఇలాంటివి తనకు అస్సలు గిట్టవని ఆమె స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు. తన నియోజకవర్గంలోకి ఎవరు అడుగు పెట్టాలన్నా తన పర్మిషన్ కావాల్సిందేనని రోజా చెబుతున్నారు. ఇప్పుడు ఇది వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది.

దూకుడుగా ఉంటూ…..

నగరి ఎమ్మెల్యేగా ఆమె రెండోసారి విజయం సాధించారు. మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించినా సామాజిక వర్గాల సమీకరణాల నేపథ్యంలోనే రోజాకు బెర్త్ దక్కలేదు. దీంతో రోజా అలిగారు అప్పట్లో మంత్రుల ప్రమాణస్వీకారానికి కూడా హాజరుకాకుండా తన అసంతృప్తిని తెలియజేశారు. దీంతో జగన్ తర్వాత రోజాకు ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఇటు నియోజకవర్గంలోనూ, ఇటు పార్టీ కార్యక్రమాల్లోనూ రోజా దూకుడుగా ఉంటారు.

తనపై కుట్ర జరుగుతుందంటూ…

అయితే గత కొంతకాలంగా నగరి నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు రోజాను బాధించాయంటున్నారు. తన వ్యతిరేక వర్గాన్ని వైసీపీలోని కొందరు నేతలు దగ్గరకు తీయడం రోజా సహించలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే నేరుగా ముఖ్యమంత్రి జగన్ కు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో పాటు మంత్రి నారాయణస్వామి ఇటీవల తన నియోజకవర్గంలో తనకు తెలియకుండా కలెక్టర్ తో కలసి పర్యటించడంతో రోజాకు మరింత ఆగ్రహం కల్గించింది.

మంత్రులు రావాలంటే….

దీంతో రోజా మంత్రులెవరూ తన నియోజకవర్గానికి రాకపోయినా పరవలేదు కాని తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవద్దని చెబుతున్నారట. అంతేకాదు తనకు తెలియకుండా వస్తే ఊరుకోబోనని కూడా మంత్రులకు హెచ్చరిక పంపారన్న టాక్ ఉంది. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామిలను ఉద్దేశించి రోజా ఈరకమైన హెచ్చరికలు చేసినట్లు స్పష‌్టంగా తెలుస్తోంది. తనకు వ్యతిరేకంగా తన నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలే కుట్ర చేస్తున్నారని రోజా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద రోజా తన నియోజకవర్గంలోకి ఎవరు ఎంటర్ అయినా తన పర్మిషన్ ఉండాల్సిందేనంటున్నారు.

Tags:    

Similar News