రోజా జబర్దస్త్ కు జగన్ మార్క్ చెక్… ?

ఆర్కే రోజా. ముందు సినిమా నటి. ఆ తరువాతనే ఆమె రాజకీయ నాయకురాలు. అయితే ఆమె సినిమా రంగాన్ని విడిచిపెట్టినా టీవీ షోలను మాత్రం అసలు వదులుకోవడంలేదు. [more]

Update: 2021-07-18 12:30 GMT

ఆర్కే రోజా. ముందు సినిమా నటి. ఆ తరువాతనే ఆమె రాజకీయ నాయకురాలు. అయితే ఆమె సినిమా రంగాన్ని విడిచిపెట్టినా టీవీ షోలను మాత్రం అసలు వదులుకోవడంలేదు. పైగా జగన్ కి బద్ధ శత్రువుగా ఉన్న ఒక మీడియా యాజమాన్యం ఆద్వరంలో నడిచే టీవీ షోకి జడ్జి గా పనిచేస్తున్నారు. దానికి ఆమె లాజిక్ ఏంటి అంటే తాను ఎమ్మెల్యే కాక ముందు నుంచి జడ్జిగా ఉన్నాను అని. అయితే ఆర్కే రోజా. విపక్షంలో ఉన్నపుడు కూడా జబర్దస్త్ వదులుకోలేదు. ఇపుడు వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినా కూడా ఆర్కే రోజా. ఆ షోని అసలు వదలడంలేదు. దాంతో అక్కడే వైసీపీ పెద్దలకు ఆమె మీద గుర్రుగా ఉంది.

ఉన్నదీ పోయింది….

ఇదిలా ఉంటే తనకు మంత్రి పదవి ఖాయమని ఆర్కే రోజా అనుకున్నారు. కానీ ఆమెను పక్కన పెట్టి జగన్ రెండేళ్ల క్రితం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. నాడు అలిగిన రోజాకు ఏపీఐఐసీ చైర్ పర్సన్ పదవిని అప్పగించారు. క్యాబినేట్ ర్యాంక్ పదవిని ఇచ్చినా కూడా ఆర్కే రోజా. ఆ పదవికి కూడా ఏ మాత్రం న్యాయం చేయలేదు. దానికి ఆమెలో నెలకొన్న అసంతృప్తి ప్రధాన కారణమని అంటారు. ఈ క్రమంలో ఉన్న ఆ పదవిని కూడా జగన్ లాగేసుకుని రాయలసీమకు చెందిన మెట్టు గోవిందరెడ్డికి కట్టబెట్టేశారు. ఆర్కే రోజా.ను అలా వట్టి ఎమ్మెల్యేగానే ఉంచేశారు. ఇది నిజంగా ఆమెకు గట్టి షాక్ గానే భావిస్తున్నారు.

నోరు తగ్గింది….

ఇక ఈ మధ్య కాలంలో ఆర్కే రోజా నోరు జోరు కూడా తగ్గిందని పార్టీ అధినాయకత్వం గమనిస్తోంది. ఇదివరకూ మీడియా ముందుకు వచ్చి విపక్షాన్ని గట్టిగానే ఆమె టార్గెట్ చేసేది. వైసీపీకి అండగా పెద్ద గొంతుకతో శత్రువులను చీల్చిచెండాడేది. కానీ ఇపుడు మాత్రం అంతా రివర్స్ అయింది. ఆర్కే రోజా. పల్లెత్తు మాట అనడంలేదు. జగన్ని టీడీపీ నేతలు ఇష్టారాజ్యంగా మాటలు అంటున్నా కూడా ఆమె కనీసం స్పందించడంలేదు. దాంతో పాటు ఆమెకు సొంత జిల్లా చిత్తూరులోని నేతలతో ఉన్న అభిప్రాయ భేదాలు, ఎవరికీ కలుపుకుని ముందుకు పోకపోవడం, హైదరాబాద్ లోనే మకాం వంటివి చూసిన మీదటనే పూర్తిగా పక్కన పెట్టారని అంటున్నారు.

ఇస్తే అదేనా..?

ఇక మరి కొద్ది నెలలలో జరిగే మంత్రి వర్గ విస్తరణలో కూడా ఆర్కే రోజా కు చోటు దక్కదు అన్నది కచ్చితమైన మాటగా ఉంది. దానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాతో పాటు, సామాజికవర్గం కూడా కారణం అంటున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కొత్తవారిని తీసుకోవాలంటే సీనియర్లు, జగన్ కి అత్యంత సన్నిహితులు చాలా మంది ఉన్నారు. ఇక చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డిని, భూమన, చెవిరెడ్డిని కాదని జగన్ ఆర్కే రోజాకి చాన్స్ ఇచ్చే సీన్ లేనేలేదని అంటున్నారు. ఆమెను టీటీడీ బోర్డు మెంబర్ గా నియమిస్తారు అన్నది తాజా టాక్. అది కూడా ఆమె ఒప్పుకుంటేనే సమీకరణలు సరిపోతేనే అంటున్నారు. అంటే రోజాకు మంత్రి యోగం లేదు అన్నది కన్ ఫర్మ్. మరో మూడేళ్ళు ఆమె హ్యాపీగా జబర్దస్త్ జడ్జీగా కొనసాగవచ్చు అని హై కమాండ్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది అని సెటైర్లు పడుతున్నాయి.

Tags:    

Similar News