నగరిలో రోజా స్కిట్ … అదిరిపోయిందనుకునేలోగానే?

ఇప్పడు వైసీపీలో ఆర్కే రోజా హాట్ టాపిక్ గా మారారు. నగరి మున్సిపల్ అధికారి ఒకరు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. [more]

Update: 2020-04-10 13:30 GMT

ఇప్పడు వైసీపీలో ఆర్కే రోజా హాట్ టాపిక్ గా మారారు. నగరి మున్సిపల్ అధికారి ఒకరు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. ప్రభుత్వాన్ని దూషిస్తూ ఒక అధికారి చేసిన వ్యాఖ్యలు అధికార వర్గాల్లో సంచలనంగా మారాయి. ఆ అధికారి వెనక ఎవరు ఉన్నారు? ఎందుకు ఇలా మాట్లాడారు? అన్న దానిపై అంతర్గత విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఇందులో రోజా పాత్ర ఎంత అన్న దానిపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

అధికారి వ్యాఖ్యలతో…..

నగరి మున్సిపల్ అధికారి ఒకరు రోజాలాంటి నేతను తాను చూడనేలేదని చెప్పారు. రోజా లేకపోతే నగరి నియోజకర్గం ఏమైపోయేదో? అన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోయినా తాను ఇస్తానంటూ రోజా ముందుకు రావడం ముదావహమని ఆయన ప్రశంసించారు. రోజా ఇంటింటికి తిరిగి మాస్క్ లను పంపిణీ చేశారన్నారు. మరే రాజకీయ నేత ఇటు వైపు చూడలేనది కూడా ఆయన వ్యాఖ్యానించారు.

కొద్దికాలంగా నగరిలో…..

అయితే నగరి నియోజకవర్గంలో గత కొంతకాలంగా రాజకీయంగా విభేదాలున్నాయన్నట మాట వాస్తవం. వైసీపీలోనే రోజాకు వ్యతిరేకంగా ఒక వర్గం తయారయింది. ఆ వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరో మంత్రి నారాయణ స్వామి తనను, తన నియోజకవర్గాన్ని టార్గెట్ చేసినట్లు రోజా భావిస్తున్నారు. దీనిపై జగన్ కు కూడా రోజా గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఇటీవల వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి, నారాయణస్వామిలు రోజా ఇంటికి వెళ్లి చర్చలు జరిపి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వారి జోక్యం ఏంటని రోజా సూటిగానే ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఎవరూ వేలు పెట్టకూడదని….

ఈ నేపథ్యంలో నగరి నియోజకవర్గంలో ఎవరూ వేలు పెట్టకుండా ఉండేందుకు గత పక్షం రోజుల నుంచి రోజా కష్టపడుతూనే ఉన్నారు. పేదలకు కూరగాయలను పంపిణీ చేస్తున్నారు. ఇంటింటికీ తిరిగి మాస్క్ లను అందచేశారు. అంతేకాదు పేదలకు భోజనాలను కూడా అందిస్తున్నారు. అయితే ఇప్పుడు అధికారి చేసిన వ్యాఖ్యలు రోజా రాజకీయ ప్రయోజనాల కోసమేనన్న కామెంట్స్ పార్టీలోనే బలంగా విన్పిస్తున్నాయి. ప్రభుత్వం చేయలేని సాయం రోజా చేస్తుందా? చేయగలుగుతుందా? అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నగిరి మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డిని సస్పెండ్ చేసింది. అంటే రోజాకు కొంత చెక్ పెట్టినట్లేనా?

Tags:    

Similar News