ఈసారి ఆర్జేడీకి ఆ దెబ్బ పడుతుందా?

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. అక్టోబరు నెలలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేేసే అవకాశముంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూలు ప్రచారాన్ని ప్రారంభించాయి. సోషల్ [more]

Update: 2020-09-07 17:30 GMT

బీహార్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుంది. అక్టోబరు నెలలో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేేసే అవకాశముంది. ఇప్పటికే అధికారంలో ఉన్న బీజేపీ, జేడీయూలు ప్రచారాన్ని ప్రారంభించాయి. సోషల్ మీడియా ద్వారా కేంద్ర, రాష్ట్ర పథకాలను ప్రజలకు చేరవేడయంలో బీజేపీ ప్రస్తుతం ముందుంది. జేడీయూ కూడా బీజేపీతో సమ ఉజ్జీగా ప్రచారం చేసుకుంటూ వెళుతుంది. కానీ విపక్ష ఆర్జేడీ మాత్రం ఇంతవరకూ ఎలాంటి ప్రచారాలను ప్రారంభించలేదు.

సమస్యలతో ఆర్జేడీ….

ప్రధానంగా బీహార్ లో ఆర్జేడీకి అనేక సమస్యలున్నాయి. కుటుంబ సమస్యలు ఎన్నికల సమయానికి ఒక కొలిక్కి వస్తాయని భావించినా మిత్రుల నుంచే ఇబ్బందులు తప్పవన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే మాంఝీ పార్టీ ఆర్జేడీ కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. కమ్యునిస్టు పార్టీలు కూడా ఈసారి ఎక్కువ స్థానాలు కోరే అవకాశాలు స్పష‌్టంగా కన్పిస్తున్నాయి. ఇంతవరకూ సీట్ల పంపకాలపై ఆర్జేడీ మిత్రపక్షాలతో చర్చలే ప్రారంభించలేదు.

సీట్ల సర్దుబాటులో…..

ప్రధానంగా కాంగ్రెస్, ఆర్జేడీలు కూటమిలో కీలక భూమిక పోషించనున్నాయి. బీహార్ కాంగ్రెస్ నేతలు సయితం ఎక్కువ స్థానాలను కోరుకుంటున్నారు. తాము కూడా ఐదేళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నామని, ఈసారి ఆశించిన సీట్లు లభించకుంటే రెబల్ గా పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీహార్ కాంగ్రెస్ నేతలు వార్నింగ్ లు పంపుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవచ్చని ఆర్జేడీ భావిస్తుంది.

రెబెల్స్ సమస్య…..

ఈసారి విపక్ష పార్టీల్లో ఆశావహుల్లో ఎక్కువగా ఉన్నట్లు కన్పిస్తుంది. తొలి ఏడాదిన్నర అధికారంలో ఉన్నప్పటికీ తర్వాత విపక్షంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని నియోజకవర్గాల్లో పట్టును పెంచుకునే ప్రయత్నం చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గంలో చేపడుతున్నారు. దీంతో కాంగ్రెస్ నుంచి ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. సీట్ల సర్దుబాటులో ఆశించిన సంఖ్యలో రాకుంటే కాంగ్రెస్ నుంచే రెబెల్స్ బెడద ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వీలయినంత త్వరగా సీట్ల సర్దుబాటు చేసుకోవాలని ఆర్జేడీకి సూచిస్తున్నారు.

Tags:    

Similar News