ఇక ప్రజలు ఎన్నుకుంది ఎందుకు? గోలీలాడుకోవడానికా?

న్యాయస్థానాలు ప్రజాతీర్పును పరిహాసం చేస్తున్నాయా? ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకుండా పోతుందా? గడచిన ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే హక్కు ప్రస్తుత ప్రభుత్వానికి [more]

Update: 2020-09-21 05:00 GMT

న్యాయస్థానాలు ప్రజాతీర్పును పరిహాసం చేస్తున్నాయా? ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విలువ లేకుండా పోతుందా? గడచిన ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే హక్కు ప్రస్తుత ప్రభుత్వానికి లేదా? అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇదే చెబుతుంది. గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించడం ఇప్పుడే కొత్త కాదు. అనేక నిర్ణయాలను కొత్త ప్రభుత్వాలు సమీక్షించాయి. తమకు అనుకూలంగా మలచుకున్నాయి.

మంత్రివర్గ ఉపసంఘం తేల్చినా…

అమరావతి రాజధాని భూముల్లో కుంభకోణం జరిగిందని వైసీపీ ప్రభుత్వం తొలుల మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మంత్రి వర్గ ఉప సంఘం కూడా సుమారు 4 వేల ఎకరాలు తెలుగుదేశం నేతలు, బినామీలు కొనుగోలు చేసినట్లు తేల్చింది. తెల్ల రేషన్ కార్డుదారుల పేరిట కూడా అమరావతిలో భూములు ఉన్నట్లు తేల్చింది. మంత్రివర్గం ఉపసంఘం నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం ను ఏర్పాటు చేసింది.

విచారణను నిలుపుదల చేస్తూ….

అయితే మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలు వర్ల రామయ్య, ఆలపాట రాజేంద్ర ప్రసాద్ లు హైకోర్టును ఆశ్రయించారు. వీరి పిటీషన్లను విచారించిన హైకోర్టు దర్యాప్తును నిలిపేయాలని ఆదేశించడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. మేధావులు, న్యాయనిపుణులు కూడా తప్పుపడుతున్నారు. ఒక ప్రభుత్వం పద్ధతి ప్రకారం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, ఆ తర్వాత సిట్ ను ఏర్పాటు చేస్తే దానిపై అభ్యంతరాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. కొందరి పేర్లు ఉన్నాయని ఎవరికైనా అభ్యంతరం ఉండి ఉండవచ్చు. అయితే నిష్పక్షపాతంగా విచారణ జరగదని భావించినప్పుడు వేరే సంస్థకు విచారణ బాధ్యతలను అప్పగించాల్సి ఉంటుంది.

సమీక్షించే హక్కు లేదా?

ఎక్కడైనా ఒక అవినీతి జరిగితే దానిపై నిజానిజాలను నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది. గతంలో అనేక ప్రభుత్వాలు ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించిన దాఖలాలున్నాయి. నిజానికి ప్రభుత్వ విచారణపై నమ్మకం లేకుంటే మరో స్వతంత్ర సంస్థ చేత విచారణకు ఆదేశించాల్సి ఉండాల్సింది. అంతే కాని ఏకంగా విచారణనే నిలుపుదల చేయడంపై సర్వత్రా విమర్శలు విన్పిస్తున్నాయి. ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం ఉన్నది ఒక్క న్యాయవ్యవస్థ మీదనే. దానిని కూడా నవ్వుల పాలు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది.

Tags:    

Similar News