రేవంత్ ది విఫల ప్రయోగమేనా?

రేవంత్ రెడ్డి అరుపులు..విరుపులు ఓట్లు తెచ్చిపెడతాయా? అసలు రేవంత్ రెడ్డి ఎంపికను ఏఐసీసీ ఎలా చేసింది? ఆయనలో ఏ ప్లస్ లు కన్పించాయి? ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో [more]

Update: 2021-07-11 00:30 GMT

రేవంత్ రెడ్డి అరుపులు..విరుపులు ఓట్లు తెచ్చిపెడతాయా? అసలు రేవంత్ రెడ్డి ఎంపికను ఏఐసీసీ ఎలా చేసింది? ఆయనలో ఏ ప్లస్ లు కన్పించాయి? ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఊహించని విధంగా రేవంత్ రెడ్డి నియామకం వెనక ఏం జరిగిందన్న దానిపై అనేక మంది సీనియర్ నేతలు సయితం ఆరా తీస్తున్నారట. అయితే కేవలం ఆసక్తితోనేనని చెబుతున్నారు. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతూనే ఏం జరిగిందన్ దానిపై ఢిల్లీలో తమకు పరిచయమున్న నేతల ద్వారా సమాచారం సేకరించే పనిలో పడ్డారు.

ఊహించని విధంగా….

నిజానికి కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేవంత్ రెడ్డికి వస్తుందని సీనియర్ నేతలు ఎవరూ ఊహించలేదు. మూడున్నరేళ్ల క్రితమే పార్టీలో చేరడం, దూకుడు స్వభావం, క్రెడిబులిటీ లేకపోవడం వంటి కారణాలతో రేవంత్ రెడ్డిని పక్కన పెడతారని అందరూ భావించారు. సీనియారిటీ, సిన్సియారిటీని చూస్తారనుకున్నారు. కానీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ లోని 70 శాతం మంది నేతలను విస్మయానికి గురి చేసిందనే చెప్పాలి.

క్రెడిబులిటీ లేకపోతే..

రేవంత్ రెడ్డికి క్రెడిబులిటీ లేదు. ఆయన ఒక నియోజకవర్గానికి నాయకుడే కావచ్చు కాని రాష్ట్రస్థాయి నేత కాదన్నది సీనియర్ల ఒపీనియన్. రేవంత్ రెడ్డిపై అనేక కేసులు ఉన్నాయి. భూ వివాదాలున్నాయి. సహజంగా పీసీసీ అధ్యక్షుడంటే కాబోయే ముఖ్యమంత్రిగానే చూస్తారు. అలాంటిది కొత్త రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి చేతుల్లో పెట్టేందుకు వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు మొగ్గు చూపుతారా? అన్నది కష్టమేనని ఒక కాంగ్రెస్ సీనియర్ నేత అభిప్రాయపడ్డారు.

మరో తప్పిదమేనా?

రేవంత్ రెడ్డి డైలాగులు బాగానే ఉండవచ్చు. ప్రజల్లోకి చొచ్చొకుని వెళ్లవచ్చు. కానీ క్రెడిబులిటీ లేని నాయకత్వానికి ప్రజలు రాష్ట్రాన్ని అప్పగించేందుకు సిద్ధంగా ఉండరన్న విశ్లేషణలు కాంగ్రెస్ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి ఘోరమైన తప్పిదం చేసిందని, రేవంత్ రెడ్డి ప్రయోగం విఫలం కాక తప్పదని విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. రేవంత్ రెడ్డి నియామకంతో పార్టీకి వచ్చిన హైప్ తాత్కాలికమేనన్న వ్యాఖ్యలు కూడా విన్పిస్తున్నాయి.

Tags:    

Similar News