Revanth reddy : ప్లాన్ రెడీ… పది నెలల పాటు?

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో వరసగా ఓటమి ఎదురు చూసింది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి ఫ్రీ హ్యాండ్ [more]

Update: 2021-09-26 11:00 GMT

తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో వరసగా ఓటమి ఎదురు చూసింది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించేందుకు అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఢిల్లీ నుంచి ఫ్రీ హ్యాండ్ రావడంతో ఇక్కడ కాంగ్రెస్ అగ్ర నేతలు ఇక ఎఫెన్స్ లో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారు. నిజానికి ఎన్నికలకు ముందు ఈ పాదయాత్ర చేయాలని రేవంత్ రెడ్డి భావించారు.

ముందుగానే….

కానీ ముందుగానే పాదయాత్ర చేయడానికి రేవంత్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలిసింది. ముందస్తు ఎన్నికలు ఒకవేళ వచ్చినా పాదయాత్ర తో కొంత పార్టీని బలోపేతం చేయవచ్చన్నది ఆయన ఆలోచనగా ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లిన ఆయన తన పాదయాత్ర విషయమై కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్లు చెబుతున్నారు. వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వచ్చే ఏడాది ప్రారంభంలోనే రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

క్యాడర్ లో జోష్….

పాదయాత్ర తో కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? లేదా? అన్నది పక్కన పెడితే కాంగ్రెస్ క్యాడర్ లో జోష్ పెరగడమే కాకుండా, కోల్పోయిన ఓటు బ్యాంకును తిరిగి దక్కే వీలుందని అంచనా వేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో బలమైన నేతలను ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం చేయాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందంటున్నారు. వారే వచ్చే ఎన్నికలలో అభ్యర్థులుగా ఉంచుతామని చెప్పి యాక్టివ్ చేయాలని రేవంత్ రెడ్డికి సూచించినట్లు తెలిసింది.

రూట్ మ్యాప్ తయారీకి…

పాదయాత్ర ఎక్కడి నుంచి ప్రారంభమై ఎక్కడ ముగియాలన్న దానిపై రేవంత్ రెడ్డి ప్లాన్ రూపొందించారు. తెలంగాణలోని అన్ని జిల్లాలను కవర్ చేసేలా పాదయాత్ర ఉండనుంది. తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయాలంటే కనీసం పది నెలల సమయం పడుతుందని భావిస్తున్నారు. ఇందుకు రూట్ మ్యాప్ తయారు చేయాలని రేవంత్ రెడ్డి నేతలకు సూచించినట్లు తెలిసింది. వచ్చే ఏడాది రేవంత్ రెడ్డి పాదయాత్రతో జనంలోకి వెళుతున్నారు.

Tags:    

Similar News