రేవంత్ ను రవ్వంత చేయాలనేగా?

తెలంగాణ పీీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ [more]

Update: 2021-09-05 09:30 GMT

తెలంగాణ పీీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. దీంతో సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు సహించలేకపోతున్నారు. ఆయనపై అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ రెడ్డి తన పోకడలను మార్చుకోకపోతే పార్టీకి తీవ్ర నష్టం జరగడం ఖాయమని పార్టీ అధినాయకత్వానికి సంకేతాలను కూడా కొందరు సీనియర్ నేతలు పంపినట్లు తెలిసింది.

జోష్ వచ్చినా…?

నిజానికి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కొంత పార్టీలో జోష్ పెరిగిందనే చెప్పాలి. అనేక సభలు, సమావేశాలను రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసి పార్టీ క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధీటైన పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని చెబుతున్నారు. అయితే ఆయన ఇటీవల నిర్వహించిన సభల్లో ఆయన భజన ఎక్కువగా ఉందన్నది సీనియర్ నేతల ఆరోపణ.

వ్యక్తిగత ఇమేజ్ ను….

సీనియర్ నేతలకు సభలు, సమావేశాల్లో తగిన గౌరవం, ప్రాముఖ్యత లభించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూర్ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది. ఇలా పార్టీని అడ్డుపెట్టుకుని తన వ్యక్తిగత ఇమేజ్ ను పెంచుకోవాలని చూస్తే సహించబోమని కొందరు నేతలు హెచ్చరించినట్లు కూడా సమాచారం.

సభలు, సమావేశాల్లోనూ…

రేవంత్ రెడ్డి పార్టీ సభలు, సమావేశాల్లో కాంగ్రెస్ అగ్రనేత సోనియా, రాహుల్ తో పాటు తనది కూడా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసుకుంటున్నారు. తనపై ప్రత్యేకంగా తయారు చేయించిన ఆడియోలతో హోరెత్తిస్తున్నారు. దీనిని కాంగ్రెస్ సీనియర్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలోనే సీనియర్ నేతలు కాంగ్రెస్ హైకమాండ్ ను కలసి ఫిర్యాదు చేయాలన్న యోచనలో ఉన్నారు. మొత్త మీద రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు సీనియర్ నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News