రేవంత్ దెబ్బకు బెదురు మొదలయిందా?

ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. మంచికి మంచిగా, చెడును చెడుగానే అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి [more]

Update: 2021-07-28 03:30 GMT

ఏ విషయానికి ఆ విషయం చెప్పుకోవాలి. మంచికి మంచిగా, చెడును చెడుగానే అనుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి మెరుగుపడుతుంది. పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత క్రమంగా క్యాడర్ లో ధైర్యం పెరుగుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే అధికార పార్టీలో కూడా రేవంత్ అలజడి మొదలయిందనే చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ లో మార్పు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హడావిడికి రేవంత్ రాకే కారణమని చెప్పక తప్పదు.

గాంధీ భవన్ కళకళ….

మొన్నటి వరకూ గాంధీ భవన్ ఎలా ఉండేది. దాన్ని పట్టించుకునే వారెవరైనా ఉన్నారా? వీహెచ్ లాంటినేతలు వచ్చి మీడియా మీట్లు పెట్టి వెళ్లడం తప్ప దాని మొఖం చూడటానికి కూడా ఎవరూ ఇష్టపడే వారు కాదు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో లోపమని చెప్పలేము కాని. కాంగ్రెస్ ఇక రాష్ట్రంలో ఎదగలేదన్న నిరాశకావచ్చు. కానీ ఇప్పుడు పూర్తిగా మారింది. గాంధీభవన్ ఖద్దరు చొక్కాలతో కళకళలాడుతుంది.

వెళ్లేవారే తప్ప….

మొన్నటి వరకూ వెళ్లిపోయే నేతలే తప్ప కాంగ్రెస్ కు వచ్చే వారు లేరు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాకతో మళ్లీ రాకలు మొదలయ్యాయి. ఇది పార్టీకి శుభసంకేతమే. ఎర్రశేఖర్ బీజేపీ నుంచి వచ్చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీలో చేరికకు డేట్ ఫిక్స్ చేసుకుంటున్నారు. డీఎస్ తనయుడు సంజయ్ జై కాంగ్రెస్ అనేశారు. దీనికి కారణం రేవంత్ కాదా? రేవంత్ రాకపోయి ఉంటే వీరు వచ్చే వారా? పార్టీకి రేవంత్ ఇచ్చిన ధైర్యం కాదా? అన్న చర్చ జరుగుతుంది.

అధికార పార్టీలోనూ….

కాంగ్రెస్ విషయాన్ని పక్కన పెడితే అధికార పార్టీలో కూడా రేవంత్ రెడ్డి అలజడి మొదలయింది. తమను దెబ్బతీస్తారన్నంత భయం కాకపోవచ్చు కాని కొంత బెదురయితే మొదలయింది. అందుకే టీఆర్ఎస్ లో గతంలో లేని విధంగా యాక్టివిటీ మొదలయిందనే చెప్పాలి. కేటీఆర్, కేసీఆర్ జిల్లాల బాట పట్టారు. ఇటు బీజేపీ కూడా అలర్ట్ అయింది. మొత్తం మీద రేవంత్ రెడ్డి పార్టీని అధికారంలోకి తెస్తాడా? లేదా? అన్నది పక్కన పెడితే క్యాడర్ లో జోష్ నింపారన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News