నిజం ఒప్పుకున్న రేవంత్ రెడ్డి …?

అశాస్త్రీయ విభజనకు ఆంధ్రప్రదేశ్ బలైంది. ఓట్లు సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసిన వైనం తెలుగు వారు మరిచిపోలేకపోతున్నారు. దానికి [more]

Update: 2021-07-09 09:30 GMT

అశాస్త్రీయ విభజనకు ఆంధ్రప్రదేశ్ బలైంది. ఓట్లు సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేసిన వైనం తెలుగు వారు మరిచిపోలేకపోతున్నారు. దానికి తగ్గ ఫలితం కూడా ఆ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో దారుణంగా అనుభవిస్తుంది. అంతేకాదు. తెలుగు వారి శాపానికి దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్ధం అయ్యే పరిస్థితి దాపురించింది. ఎపి లో కాంగ్రెస్ వాదులు చెట్టుకొకరు పుట్టకొకరు పోయారు.

నీటి విషయంలో….

వీలున్నవారు ఎదో ఒకపార్టీ జండా పట్టుకుని బతుకు జీవుడా అని ప్రజల్లో తిరుగుతూ ఉంటె మరికొందరు రాజకీయ సమాధి అయిపోయారు. ఇప్పటికి విభజన తెచ్చిన చిచ్చు అంతా ఇంతా కాదు. నీళ్ళు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ నిప్పులు గా మారిపోయాయి. ఆస్తుల పంపకాలు నేటికీ సక్రమంగా జరిగింది లేదు. ఇక రోజుకో కొత్త సమస్య పుట్టుకొస్తూ మరిచిపోతున్న ఆంధ్రుల విభజన గాయాన్ని తట్టిలేపుతూనే ఉంటుంది.

ద్రోహం నిజమేనా …?

ఇంత చేసి నలుగురిలో నగుబాటు అయినా తెలంగాణ లో అధికారంలోకి వస్తే చాలు అనుకున్న కాంగ్రెస్ కలలు కల్లలే అయిపోయాయి. టి కాంగ్రెస్ నేతలు నుంచి ఆ పార్టీ అధిష్టానం వరకు ఇప్పటికి కెసిఆర్ చేతిలో రెండుసార్లు జరిగిన పరాభవం వారిని మరింత కుమిలిపోయేలా చేస్తుంది . తాజాగా టిపిసిసి అధ్యక్షుడు గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారంలో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసి అక్కడ ఓడిపోతామని తెలిసినా కాంగ్రెస్ తెలంగాణ ఇస్తే సోనియాకు ఇక్కడివారు ఇచ్చిన బహుమానం ఇదేనా అంటూ ప్రశ్నలు సంధించి జరిగిన ఘోరం మరోసారి ఆంధ్రావారికి తెలిసేలా చేశారు. ఎపి లోను దేశంలోనూ,కాంగ్రెస్ ఓటమికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే కాంగ్రెస్ నాశనం అయ్యిందని చెప్పక చెప్పేశారు రేవంత్ రెడ్డి. చట్టవిరుద్ధంగా పార్లమెంట్ వేదికగా నాటి స్పీకర్ చేత నాటకం ఆడించి జరిగిన విభజన కాంగ్రెస్ కు చేదు అనుభవాలని మిగిల్చింది. ఇప్పుడు చేతులు కాలకా ఆకులు పట్టుకునే టి నేతల ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News