రేవంత్ ను నడిపిస్తుంది ఆయనేనటగా?

పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డికి మీడియా దన్నుగా నిలుస్తుంది. ఒకవర్గం మీడియా ఆయనను ఆకాశానికెత్తేలా ప్రచారం ప్రారంభించింది. గతంలో ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీకి లభించని [more]

Update: 2021-07-13 11:00 GMT

పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డికి మీడియా దన్నుగా నిలుస్తుంది. ఒకవర్గం మీడియా ఆయనను ఆకాశానికెత్తేలా ప్రచారం ప్రారంభించింది. గతంలో ఏడేళ్లు కాంగ్రెస్ పార్టీకి లభించని ప్రచారం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కాగానే లభిస్తుండటం విశేషం. ఇది రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు. ఆయన వెనక ఉన్న నీడలదేనన్న కామెంట్స్ బలంగా వినపడుతున్నాయి. ఇప్పుడు ఒక వర్గం మీడియా కెమెరాల ఫోకస్ మొత్తం రేవంత్ రెడ్డిపైనే ఉంది.

గతంలో ఇలా లేదు….

గతంలో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఈరకమైన ప్రచారం మీడియాలో దక్కేది కాదు. ఆయన ఏడేళ్లు పార్టీ కోసం ఎంత శ్రమించినా అనుకున్న ఫలితం దక్కలేదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఫేట్ మారినట్లుంది. తెలంగాణలో ఏ మీడియాలో చూసినా రేవంత్ రెడ్డి జపమే కన్పిస్తుంది. ఏపీలో జగన్ కు వ్యతిరేక మీడియా మొత్తం ఇక్కడ రేవంత్ రెడ్డికి మద్దతుగానే నిలుస్తున్నట్లు కన్పిస్తుంది.

ఆయన స్క్రిప్ట్ ప్రకారమే…..

ఇక రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన దగ్గర నుంచి ఆయన ఒక మీడియా అధిపతి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు చెబుతున్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆ పత్రికాధిపతి రేవంత్ కు కీలక సలహాదారుగా మారినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట అక్కడి నుంచే వస్తున్నాయని, ఆ స్క్రిప్ట్ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారన్న టాక్ కాంగ్రెస్ లో బలంగా విన్పిస్తుంది.

సోషల్ మీడియా టీం కూడా…..

సోషల్ మీడియాలో కూడా రేవంత రెడ్డి ప్రచారం ప్రారంభించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వ్యక్తిగతంగా తన ఇమేజ్ ను పెంచుకునేందుకు సోషల్ మీడియా టీం ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఇమేజ్ కు తగినట్లుగానే రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి ఎదగాలన్నది ఆ మీడియా లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకే రేవంత్ తుమ్మినా, దగ్గినా పతాక శీర్షికల్లో వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కాంగ్రెస్ కు చాలా కాలం తర్వాత తెలంగాణలో మీడియా దన్ను దక్కింది.

Tags:    

Similar News