రేవంత్ కు వాళ్లే….?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కీలకంగా మారారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి [more]

Update: 2019-08-04 09:30 GMT

తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో కీలకంగా మారారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయినా పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది. ప్రశ్నించే వారున్నప్పటికీ అంతగా బలంగా జనంలోకి వెళ్లడం లేదు. అధికార పార్టీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేయాలంటే రేవంత్ రెడ్డి సరైనోడు అన్నది కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయంగా విన్పిస్తుంది.

ఉత్తమ్ ను తొలగిస్తే….

ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. ఆయన టర్మ్ పూర్తికావడంతో పాటు ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడయ్యారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీీసీ చీఫ్ పదవి నుంచి త్వరలోనే తప్పుకుంటారన్నది వాస్తవం. ఆయన తప్పుకోనున్నా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ఉత్తమ్ స్థానంలో మరొకరిని నియమించడం ఖాయంగా కన్పిస్తుంది.

కోమటిరెడ్డి ప్రయత్నిస్తున్నా….

తెలంగాణ కాంగ్రెస్ లో రెడ్డి సామాజిక వర్గమే తొలి నుంచి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. దీంతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదతరులు పోటీ పడుతున్నారు. తాను పాదయాత్ర కూడా చేస్తానని ఇటీవల కోమటిరెడ్డి ప్రకటించారు. అయితే ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి చేరతారన్న ప్రచారం, రాహుల్ పై నేరుగా విమర్శలు చేయడంతో ఆయనకు ఆ పదవి దక్కడం కష్టమే. మరోవైపు రేవంత్ రెడ్డి చాపకిందనీరులా కేంద్ర నాయకత్వం వద్ద తన పని తాను చేసుకుంటున్నారు. జైపాల్ రెడ్డికి సమీపబంధువుగా కూడా కేంద్ర నాయకత్వం వద్ద రేవంత్ రెడ్డి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో రేవంత్ రెడ్డి పేరు కూడా పీసీసీ చీఫ్ రేసులో ముందుందని కాంగ్రెస్ వర్గాల నుంచి తెలుస్తోంది.

రేవంత్ కు వ్యతిరేకంగా….

అయితే బీసీ సామాజిక వర్గానికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని వి.హనుమంతరావు వంటి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీీసీ చీఫ్ పదవి ఇవ్వవద్దంటూ కొందరు అప్పుడే హస్తినకు చేరి ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో ఇరుక్కోవడంపై కూడా అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీంతో హైకమాండ్ కూడా ఆలోచనలో పడినట్లు తెలిసింది. టీడీపీలోనూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో పీసీపీ చీఫ్ పదవి దక్కడం అంత సులువైన విషయం కాదన్నది వాస్తవం.

Tags:    

Similar News