రేవంత్ కు నమ్మకం పోయిందా?

రేవంత్ రెడ్డి కి రాజకీయంగా భవిష్యత్ కన్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎదగరని తేలిపోయింది. ఆయనకు పదవి ఇచ్చేందుకు అనేక మంది అడ్డుపడుతున్నారు. దీంతో [more]

Update: 2021-02-09 11:00 GMT

రేవంత్ రెడ్డి కి రాజకీయంగా భవిష్యత్ కన్పించడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన ఎదగరని తేలిపోయింది. ఆయనకు పదవి ఇచ్చేందుకు అనేక మంది అడ్డుపడుతున్నారు. దీంతో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో భవిష్యత్ లేదని ఆయన అనుచరుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. తెలంగాణలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా తన సొంత ఇమేజ్ ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.

సొంతంగా ఇమేజ్….

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా రేవంత్ రెడ్డిదే పై చేయిగా ఉండేది. చంద్రబాబు సయితం రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేవారు. ఆయనను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. కానీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇక భవిష‌్యత్ లేదని భావించిన రేవంత్ రెడ్డి చంద్రబాబు సూచనల మేరకే కాంగ్రెస్ లోకి వచ్చారంటారు. కాంగ్రెస్ లో కూడా తొలిరోజుల్లో ఆయనకు ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ను చేశారు.

ప్రాధాన్యత ఇచ్చినా….

అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ లో ఓటమి పాలయినా తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్ గిరి సీటు ఇచ్చింది. ఇక్కడ గెలవడంతో ఆయనకు మరింత ఫ్యూచర్ కాంగ్రెస్ లో ఉంటుందని భావించారు. కానీ పీసీీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. బాగా లాబీయింగ్ కూడా చేశారు. రాహుల్ గాంధీకి కొంత సన్నిహితం కావడంతో అటు నుంచి నరుక్కొచ్చారు. కానీ సీనియర్ నేతలు ఎవరూ రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపలేదు. రేవంత్ రెడ్డికి ఇస్తే తమ దారి తాము చూసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

భవిష్యత్ లోనూ…..

దీంతో రేవంత్ రెడ్డికి ఇక పీసీసీ చీఫ్ పదవి దక్కనట్లే. ఆయనకు ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలను అప్పగించనున్నారు. భవిష‌్యత్ లోనూ రేవంత్ రెడ్డికి ఏ పదవి ఇవ్వాలన్నా కాంగ్రెస్ సీనియర్ నేతలు అడ్డుపడతారన్న అనుమానం ఆయన వర్గంలో బయలుదేరింది. అందుకే పునరాలోచించాలని రేవంత్ రెడ్డిపై వత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మరికొంత కాలం వేచి చూడాలన్న ధోరణిలోనే రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద రేవంత్ రెడ్డి మాత్రం తనకు కాంగ్రెస్ లో భవిష్యత్ లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

Tags:    

Similar News