రేవంత్ కు అంత రేంజ్ లేదా?

ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా పార్టీకి తలనొప్పులు తప్పేట్లు లేదు. పీసీసీ ఛీప్ పదవి విషయంలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. వీరిలో ఎవరికి [more]

Update: 2020-12-14 11:00 GMT

ప్రదేశ్ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా పార్టీకి తలనొప్పులు తప్పేట్లు లేదు. పీసీసీ ఛీప్ పదవి విషయంలో కాంగ్రెస్ రెండు గ్రూపులుగా విడిపోయింది. వీరిలో ఎవరికి ఇచ్చినా మరొక వర్గం చీఫ్ కు సహకరించదు. ఫలితం నాగార్జున సాగర్ ఉప ఎన్నికపై పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అంతే కాకుండా తమ వర్గానికి పీసీసీ చీఫ్ పదవి దక్కుంటే పార్టీని వీడేందుకు కూడా కొందరు సిద్ధమవుతుండటం విశేషం.

ఢిల్లీకి చేరుకున్న…..

పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పడు ఢిల్లీకి చేరుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణికం ఠాగూరు ఇప్పటికే నేతల అభిప్రాయాలను సేకరించి అధిష్టానానికి నివేదిక అందించారు. తెలంగాణలో కొంత ఇమేజ్ ఉన్న నేత, కేసీఆర్ ను ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేయగలిన నేత రేవంత్ రెడ్డి కి పీసీసీ ఇవ్వాలని ఒక వర్గం వాదిస్తోంది. అప్పుడే పార్టీ పుంజుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దూకుడు నిర్ణయాలతో…..

రేవంత్ రెడ్డి ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటారని, దూకుడు నిర్ణయాలతోనే ప్రజలు పార్టీ పట్ల ఆకర్షితులవుతారని, అందుకే రేవంత్ రెడ్డి లాంటి యువకుడికే పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు కోరుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తనకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే తాను ఏం చేయదలచుకున్నదీ రూట్ మ్యాప్ ను కూడా రేవంత్ రెడ్డి అధిష్టానానికి అందచేసినట్లు చెబుతున్నారు.

అంత సీన్ లేదంటూ…..

అయితే రేవంత్ రెడ్డికి ఎట్టి పరిస్థితుల్లో పీసీసీ చీఫ్ ఇవ్వకూడదని మరొక వర్గం గట్టిగా పట్టుబడుతుంది. ఇందులో సీనియర్ నేతలందరూ ఏకమయ్యారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డికి ఇవ్వ వద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గత ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. సొంత నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఓటమి పాలయిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇస్తే పార్టీకి ఉన్న పరువు కూడా పోతుందని అంటున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలు హస్తినకు వెళ్లి రేవంత్ రెడ్డి విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News