ఆ నీడ పడకుండా చూసుకుంటే చాలట

మొత్తానికి లేట్ అయినా లేటెస్ట్ డెసిషన్ ఒకటి కాంగ్రెస్ తీసుకుంది. కాంగ్రెస్ అంటేనే రిస్క్ కి దూరం అని నావెల్టీని అడాప్ట్ చేసుకోదు అన్న వారికి తెలంగాణా [more]

Update: 2021-06-28 13:30 GMT

మొత్తానికి లేట్ అయినా లేటెస్ట్ డెసిషన్ ఒకటి కాంగ్రెస్ తీసుకుంది. కాంగ్రెస్ అంటేనే రిస్క్ కి దూరం అని నావెల్టీని అడాప్ట్ చేసుకోదు అన్న వారికి తెలంగాణా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం షాకింగ్ న్యూసే. ఇంతకాలం తెలంగాణా కాంగ్రెస్ లో సీనియర్లు అనబడే వారు చేసిన హంగామా అంతా ఇంతా కాదు, ఒక వైపు ప్రపంచం ముందుకు పోతోంది. తెలంగాణాలో పెద్దగా బలం లేని బీజేపీ కూడా బయట నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేస్తోంది. అలాంటిది కాంగ్రెస్ కి తెలంగాణా అంతటా ప్రతీ పోలింగ్ బూత్ లోనూ బలం ఉంది. క్యాడర్ ఉంది, అయినా డేరింగ్ చేయడంలేదు అన్న మాట ఉంది. దానికి సరైన జవాబు రేవంత్ రెడ్డి నియామకం.

సింహమంటీ చిన్నోడే …?

రేవంత్ రెడ్డి లో ప్లస్ మైనస్ రెండూ ఉన్నాయి. ఆయన దూకుడు కలిగిన రాజకీయ నాయకుడు. తెలంగాణా కాంగ్రెస్ కి పక్కా మాస్ లీడర్. రాజకీయంగా చూసుకుంటే ఆయన యువకుడే. కేసీఆర్ అంటే జన్మ వైరం అన్నట్లుగా ఉంటారు. అందుకే ఆయన కసి కృషికి ఇది అగ్ని పరీక్ష అనే అంటున్నారు. ఒకనాడు వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ని అగ్రెస్సివ్ గా ఎలా నడిపించారో అలాంటి వేడి వాడి రేవంత్ రెడ్డి కి ఉన్నాయి. వైఎస్సార్ తో పోల్చకూడదు కానీ రేవంత్ ఇపుడున్న కాంగ్రెస్ నాయకులలో బెటర్ సెలెక్షన్ అనే చెప్పాలి.

అక్కడే పుట్టి….

టీయారెస్ తోనే రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం స్టార్ట్ అయింది. ఆయనది అచ్చంగా పదిహేనేళ్ల రాజకీయం. ఇంత తొందరగా ఆయన రాష్ట్రంలో అతి ముఖ్య నాయకుడు అవుతాడని ఎవరూ అనుకోలేదు. అది ఆయన కష్టమే అని చెప్పాలి. ఇక టీయారెస్ లో ఒక సాధారణ కార్పోరేటర్ గా ఆయన 2006లో గెలిచాడు, ఆ మీదట అక్కడ ధోరణులు నచ్చక టీడీపీలో చేరి ఎదిగాడు. చంద్రబాబు రేవంత్ రెడ్డి కి బాగా లిఫ్ట్ ఇచ్చాడు. దానికి ఆయన ఈ రోజుకీ ధన్యుడుగానే ఉంటాడని చెబుతారు. ఇక రేవంత్ రెడ్డి వంటి దూకుడు కలిగిన నాయకుడే కాదు, టీయారెస్ పట్లు కూడా తెలిసిన వాడు. ఆయన సారధ్యంలో కాంగ్రెస్ ని ఎదుర్కోవడం కేసీయార్ కి కొంత కష్టమే అని కూడా చెప్పాలి.

అదే మైనస్ ….

మరో వైపు చూస్తే రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు ఉంది. చంద్రబాబుని ఇప్పటికీ ఆరాధిస్తాడు అన్న పేరు కూడా ఉంది. ఇవి ఆయన దూకుడుకు ఎక్కడికక్కడ చెక్ చెప్పేలాగే ఉంటాయని అంటున్నారు. చంద్రబాబు నీడ తన మీద పడకుండా రేవంత్ రెడ్డి చూసుకోగలిగితే చాలా వరకూ సక్సెస్ అయినట్లే. లేకపోతే ఈ ఇద్దరికీ లింక్ పెట్టి మరీ కాంగ్రెస్ ని మరో మారు బదనాం చేయడానికి కేసీయార్ వ్యూహాలతో రెడీగా ఉంటారు. మరో వైపు కాంగ్రెస్ లోని ఇతర నాయకులు సీనియర్లను కలుపుకుని పోవడం పైన కూడా రేవంత్ రెడ్డి విజయం ఆధారపడి ఉంటుంది. మొత్తానికి రవ్వంత రెడ్డి అని ప్రత్యర్ధులు విమర్శించినా రేవంత్ రెడ్డి తన టార్గెట్ కి దగ్గరలోకి రావడం విశేషంగానే చూడాలి.

Tags:    

Similar News