రేవంత్ వైపే మొగ్గు చూపుతున్నారా?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై త్వరలోనే ఉత్కంఠకు తెరపడనుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి కావడంతో త్వరలోనే పార్టీ హైకమాండ్ కొత్త [more]

Update: 2021-04-18 11:00 GMT

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారన్న దానిపై త్వరలోనే ఉత్కంఠకు తెరపడనుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పూర్తి కావడంతో త్వరలోనే పార్టీ హైకమాండ్ కొత్త పీసీసీ చీఫ్ ను నియమించనుంది. దీనికి రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా విన్పిస్తుంది. రేవంత్ రెడ్డి నే పీసీసీ చీఫ్ గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాహుల్ గాంధీ సయితం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.

అనేక మంది పోటీ పడినా….

పీసీపీ చీఫ్ పదవి కోసం అనేక మంది పోటీ పడ్డారు. ఇందులో రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మధు యాష్కీ వంటి నేతలు పోటీ పడ్డారు. అయితే రెండు నెలల క్రితమే జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా ప్రకటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత పీసీసీ చీఫ్ నియామకం చేపట్టాలని జానారెడ్డి స్వయంగా అధిష్టానాన్ని కోరడంతో ప్రకటన నిలిచిపోయింది.

జీవన్ రెడ్డి పేరును….

అయితే జీవన్ రెడ్డి పేరును కూడా పార్టీ అధిష్టానం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలన్నా, టీఆర్ఎస్ ను సమర్థవంతంగా ఎదుర్కొని, బీజేపీని నిలువరించే నేతగా రేవంత్ రెడ్డిని అధినాయకత్వం భావిస్తుందంటున్నారు. అయితే సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి పార్టీ పగ్గాలు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చీఫ్ గా ఎలా చేస్తారని ప్రశ్నిస్తూ సీనియర్ నేతలంతా ఏకమయ్యారు. అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

సీనియర్లు అభ్యంతరం చెప్పినా….?

కానీ దేశ వ్యాప్తంగా సీనియర్ నేతలను పక్కన పెడుతున్న రాహుల్ గాంధీ ఇక్కడ నేతల మాటలను ఎంతవరకూ వింటారన్నది ఆసక్తికరంగా మారింది. అందరితో చర్చించి, నచ్చ చెప్పి రేవంత్ రెడ్డినే పీసీసీ చీఫ్ గా ఎంపిక చేస్తారన్న సిగ్నల్స్ అందుతున్నాయి. అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటే తప్ప రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఖాయమన్న వార్తలు విన్పిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News