రేవంత్ అసలు ప్లాన్ అదేనట

తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీనియర్ నేతలు కాదనుకుంటున్న నేతనే పోటీలో ఉన్న అభ్యర్థులు కావాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించుకునేందుకు అభ్యర్థులు పోటీ [more]

Update: 2021-03-11 09:30 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. సీనియర్ నేతలు కాదనుకుంటున్న నేతనే పోటీలో ఉన్న అభ్యర్థులు కావాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికల ప్రచారాన్ని తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్నారు. తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జరగబోతోంది.

ఎమ్మెల్సీ ఎన్నికలను….

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం కోసం రేవంత్ రెడ్డికి పిలుపు రాదు. జానారెడ్డి సీనియర్ నేత కావడంతో రేవంత్ రెడ్డిని పిలిచి మరీ గోక్కున్నట్లవుతుందని భావిస్తారు. అందుకే ఆయన సీనియర్ నేతలు లేకుండానే సాగర్ లో తన ప్రచారాన్ని చేసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.

రేవంత్ ప్రచారం కోసం….

ఈ రెండు స్థానాల్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానంలో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మూడు జిల్లాల నేతలు, ముఖ్య కార్యకర్తలతో రేవంత్ రెడ్డి ఇప్పటికే సమావేశమయ్యారు. చిన్నారెడ్డి గెలుపు కోసం ఎలా శ్రమించాలో రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అలాగే వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లోనూ రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.

జిల్లాలను పర్యటిస్తూ…..

దీంతో జిల్లా నేతలు, ముఖ్య కార్యకర్తలతో రేవంత్ రెడ్డి సమావేశమై భవిష్యత్ లో తనకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్పీచ్ లకు మంచి స్పందన వస్తుంది. ఆయన విసిరే పంచ్ లకు రెస్పాన్స్ వస్తుంది. దీంతో నేతలు రేవంత్ రెడ్డి ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. సాగర్ ఉప ఎన్నికల తర్వాత పీసీసీ చీఫ్ నియామకం జరగనుంది. ఈ రేసులో తాను ముందుండేందుకు రేవంత్ రెడ్డి ఈ ఎన్నికలను ఉపయోగించుకుంటున్నారన్న టాక్ పార్టీలోనే వినపడుతుంది.

Tags:    

Similar News