రేవంత్ వైపే రాహుల్ మొగ్గు… కారణం అదేనట

రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ కు దగ్గరవుతున్నారా? ఇప్పటి వరకూ ఏ నేతకూ లేని ప్రాధాన్యత రేవంత్ రెడ్డికి లభిస్తుందా? అంటే అవుననే అంటున్నారు. రేవంత్ రెడ్డి [more]

Update: 2021-03-03 11:00 GMT

రేవంత్ రెడ్డి పార్టీ హైకమాండ్ కు దగ్గరవుతున్నారా? ఇప్పటి వరకూ ఏ నేతకూ లేని ప్రాధాన్యత రేవంత్ రెడ్డికి లభిస్తుందా? అంటే అవుననే అంటున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కు ఆయుధంగా ఉపయోగపడతారని అధినాయకత్వం భావిస్తుంది. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి పార్టీలో గత ఎన్నికలకు ముందు చేరినా పీసీసీ చీఫ్ పదవి ఇవ్వాలని డిసైడ్ అయింది. అప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చిన అధిష్టానం పీసీసీ చీఫ్ పదవి కూడా ఇవ్వాలనుకుంది.

రెండుసార్లు ఓడిపోయి…..

రేవంత్ రెడ్డి అయితేనే పార్టీని విజయవంతంగా నడిపిస్తారని హైకమాండ్ భావిస్తుంది. హైకమాండ్ కు అందిన నివేదికలన్నీ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే వచ్చాయి. రాష్ట్రం తాము ఇచ్చినా క్రెడిట్ ను కేసీఆర్ తన్నుకుపోయినా రెండుసార్లు ఘోరంగా విఫలమయిన ప్రస్తుత కాంగ్రెస్ నేతలపైన అధినాయకత్వానికి నమ్మకం లేదు. వారిని నియోజకవర్గాలకు పరిమితమైన నేతలుగానే అధినాయకత్వం భావిస్తుంది.

అన్ని విధాలుగా…..

రేవంత్ రెడ్డి జనం బలం ఉన్న నాయకుడని భావిస్తుంది. ఆర్థికంగా, సామాజిక పరంగా కూడా రేవంత్ రెడ్డి బలవంతుడు కావడంతో భవిష్యత్ లో ఆయనకు ప్రాధాన్యత దక్కే అవకాశాలు న్నాయని గాంధీభవన్ లోనే గుసగుసలు విన్పిస్తున్నాయి. సీనియర్ నేతలందరూ ముక్త కంఠంతో రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వవద్దని చెప్పడంతో హైకమాండ్ వెనక్కు తగ్గింది కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం రేవంత్ కు తగిన అవకాశాలు ఇచ్చే ఆలోచనలోనే అధినాయకత్వం ఉందని ఢిల్లీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

అది తెలిసిన తర్వాతే….?

అందుకే రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారు. రైతుల కోసం పాదయాత్ర చేశారు. పాదయాత్ర ముగింపు సభను కూడా భారీ ఎత్తున నిర్వహించారు. దీనిపై కూడా అధినాయకత్వం ఫీడ్ బ్యాక్ తీసుకుందట. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బెంగళూరులో ఒక ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన ప్రియాంక గాంధీ రేవంత్ రెడ్డిని పిలిచి మరీ మాట్లాడటం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మొత్తం మీద తనకు అధినాయకత్వం సానుకూలంగా ఉందని తెలిసే రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో యాక్టివ్ అయ్యారంటున్నారు.

Tags:    

Similar News