జేసీ బ్రదర్స్…టీడీపీ బెదుర్స్…?

ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఏమీ కాక మరేమీ చేయలేక చేష్టలుడిగిన వేళ, చతికిల పడిన సమయాన అనంతపురం జిల్లాలో ఒకే ఒక్కడుగా జేసీ [more]

Update: 2021-03-31 14:30 GMT

ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ ఏమీ కాక మరేమీ చేయలేక చేష్టలుడిగిన వేళ, చతికిల పడిన సమయాన అనంతపురం జిల్లాలో ఒకే ఒక్కడుగా జేసీ ప్రభాకరరెడ్డి మెరిశాడు. తనదైన విజయంతో మురిసాడు. ఆ విజయం తెలుగుదేశం అస్వాదించలేనిదిగా ఉండడమే ఇక్కడ విషయం. జేసీ బ్రదర్స్ ది సొంత బలం, బలగం. వారు తెలుగుదేశం పార్టీ కంటే కూడా ఎక్కువే. అందుకే వారు ఏం మాట్లాడినా చంద్రబాబు సైతం మిన్నకుండడం మినహా ఏమీ మాట్లాడలేరు. అటువంటిది జేసీ బ్రదర్స్ ఇపుడు తమ సత్తా చాటి టీడీపీలో బహు మొనగాళ్ళమనిపించుకున్నారు.

ఈ విజయం మా సొంతం…..

కష్టపడి సాధించుకున్న ఈ విజయం మా సొంతం అని జేసీ ప్రభాకరరెడ్డి కుండబద్ధలు కొట్టినట్లుగా చెప్పేశారు. తాడిపత్రిలో తాము రోడ్ల మీదకు వచ్చి మరీ పోరాడి సాధించిన ఫలం, ఫలితం చైర్మన్ పోస్ట్ అని కూడా అన్నారు. ఇందులో టీడీపీకి ఏ విధమైన క్రెడిట్ ని ఆయన ఇవ్వలేదు. అంతే కాదు, తెలుగుదేశం నేతలంతా ఏసీ గదులకే పరిమితం అయ్యారని కూడా విమర్శించారు. చంద్రబాబు మారాలి, పార్టీని మార్చాలని డిమాండ్ చేశారు.

బాబు వినలేని మాటలు…..

ఇక చైర్మన్ గా గెలిచిన తరువాత జేసీ ప్రభాకరరెడ్డి ముఖ్యమంత్రి జగన్ ని పొగుడుతూ చేసిన కామెంట్స్ కూడా చంద్రబాబు వినలేక రెండు చెవులూ మూసుకోవాల్సిందే. జగన్ కి నైతిక విలువలు ఉన్నాయని జేసీ ప్రభాకరరెడ్డి పొగిడారు. ఆయన వల్లనే తాను చైర్మన్ ని కాగలిగాను అని కూడా చెప్పారు. అచ్చం తన తండ్రి వైఎస్సార్ లాగానే జగన్ కి సమర్ధత ఉంది అంటూ కీర్తించారు. జగన్ ని తాను మర్యాదపూర్వకంగా కలుస్తాను అని కూడా జేసీ ప్రభాకరరెడ్డి చెబుతున్నారు. మొత్తానికి చంద్రబాబు కలలో కూడా భరించలేని జగన్ మీద జేసీ ప్రభాకరరెడ్డి పొగడడం అంటే అది సహించలేనిదే.

గతి లేక ఉంటున్నారా …?

ఇక జేసీ దివాకరరెడ్డి అయితే తాము గతి లేకనే టీడీపీలో ఉంటున్నామని చెప్పడమూ బాబుకు వళ్ళు మండించేదే. అంతే కాదు, బాబుకు సీఐడీ నోటీసులు వచ్చిన సందర్భాన జేసీ చేసిన కామెంట్స్ టీడీపీ అధినాయకునికి కాక పుట్టించేవే. మా వీపులు బద్ధలైన నాడే బాబుకు కూడా జరిగి ఉండాల్సింది, కాస్తా ఆలస్యం అయింది అంటూ చాలా పెద్ద మాటలే వాడేశారు. మొత్తానికి జేసీ బ్రదర్స్ తీరు కానీ దూకుడు కానీ చూస్తూంటే టీడీపీ అధినాయకత్వం బెదరాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News