రెడ్డి.. కూడా రెడీ ?

రెడ్డి కులం అగ్ర కులం. రెడ్డి అని ఎవరి పేరు చివరన ఉంటే వారికేంటి అని అంతా అనుకుంటారు. దానికి కారణం చరిత్రలో చూసినా వర్తమానంలో చూసినా [more]

Update: 2020-06-28 08:00 GMT

రెడ్డి కులం అగ్ర కులం. రెడ్డి అని ఎవరి పేరు చివరన ఉంటే వారికేంటి అని అంతా అనుకుంటారు. దానికి కారణం చరిత్రలో చూసినా వర్తమానంలో చూసినా రెడ్లకు విశేష స్థానం ఉండడమే. రెడ్డిరాజులు అంటూ రాజ్యాలను ఏలిన పాఠాలు హిస్టరీ బుక్కులో కనిపిస్తాయి. అలాగే ఆంధప్రదేశ్ లో చూసుకుంటే రెడ్లు మెజారిటీ కాలం ముఖ్యమంత్రులుగా పాలించారు. అనేకమంది మంత్రులు కూడా చేశారు. కీలకమైన స్థానాల్లో కూడా వారు ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే రెడ్లు ఏపీ జనాభాలో నాలుగు శాతం ఉన్నారు. వీరిలో ఒక శాతం మాత్రమే రాజకీయాల్లోనూ, ఇతర రంగాల్లోనూ వెలిగారు. అలాగే స్థితిమంతులు, డబ్బున్న వారు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ ఒక్క శాతంలోనే కనిపిస్తారు.

పేదలేనా…?

ఇక రెండవ వైపు చూసుకుంటే రెడ్లలోనూ పేదలు ఉన్నారని అర్ధమ‌వుతుంది. పొలాల్లో కూలీలుగా పనిచేసే రెడ్లు కూడా ఉన్నారు. ఇక చిరుద్యోగులుగా బతుకులను వెళ్లదీసే వారూ ఉన్నారు. ఉపాధి కూలీలుగా పనిచేసే రెడ్డి మహిళలూ ఉన్నారు. ముఖ్యంగా ఏపీలో ఆరేడు జిల్లాల్లో రెడ్ల ప్రాబల్యం ఎక్కువగా కనిపిస్తుంది. రాయలసీమ‌లోని నాలుగు జిల్లాలతో పాటు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరులలో రెడ్లు రాజకీయాలను శాసిస్తున్నారు కానీ ఇక్కడే మరో వైపు పెద్ద ఎత్తున పేదలైన రెడ్లు బతుకు పోరాటం చేస్తున్నారు.

ఆశలు మోస్తూ …

ఇక రెడ్లు 2014 ఎన్నికలనాటికి జగన్ కి సగానికి పైగా మద్దతు ఇచ్చారు. వారిలో మిగిలిన శాతం టీడీపీకి ఓటు వేశారు. అలా ఓట్లు చీలిపోవడం వల్ల జగన్ సీఎం ఛాన్స్ కోల్పోయారని అంటారు. ఇక 2019 నాటికి రెడ్లు పట్టుదలతో కమ్మల మాదిరిగానే సమైక్యంగా ఉంటూ వైసీపీకి ఓట్లు వేశారు. అలా నూటికి తొంబై శాతం పైగా జగన్ని నమ్ముకుని మద్దతు ఇచ్చారు. ఇదంతా ఎందుకు చేశారంటే జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కడగండ్లు తీస్తారని ఆశతోనని అంటారు. టీడీపీ పాలనలో కమ్మలను ఆదరించారు. తమ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దారి చూపుతారని గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ జరిగింది వేరుగా ఉంది. జగన్ గత ఏడాదిగా రెడ్లను పట్టించుకోవడంలేదని అంటున్నారు. ఇతర కులాలకు మాత్రం కోరకుండానే వరాలు ఇచ్చే వేలుపు అయ్యారని అంటున్నారు.

Tags:    

Similar News