పొమ్మనలేక పొగబెట్టేశారా …?

కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత గ్రూప్ లు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం బలహీనతల్లో సీనియర్ నేతలే అన్నది యువరక్తం టాక్. దశాబ్దాలపాటు రాజకీయాల్లో చక్రం [more]

Update: 2020-08-24 18:29 GMT

కాంగ్రెస్ పార్టీకి బలం బలహీనత గ్రూప్ లు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం బలహీనతల్లో సీనియర్ నేతలే అన్నది యువరక్తం టాక్. దశాబ్దాలపాటు రాజకీయాల్లో చక్రం తిప్పి 70, నుంచి 80 ఏళ్ళు వచ్చినా వారు రాజకీయాలు వదిలిపెట్టకపోగా యువతను ప్రోత్సహిస్తున్నది లేదు. అంతేకాదు నేటికీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పరోక్ష ఎన్నికల్లో మాత్రం సీట్లు దక్కించుకుని రాజ్యసభలోను, రాష్ట్రాల్లో శాసనమండలిలో చక్రం తిప్పుతూ హస్తానికి సమస్యగా మారారు.

రాహుల్ తప్పుకున్నా …

ఇవన్నీ గమనించి అధ్యక్ష బాధ్యతలనుంచి తాను తప్పుకుంటూ అన్ని కార్యవర్గాలను రాజీనామాలు చేయాలని కోరి ప్రక్షాళన చేద్దామనుకున్న రాహుల్ కి చేదు అనుభవాలే మిగిలాయి. దాంతో ఆయన కాడి వదిలి చాలాకాలం నిశ్శబ్దంగా ఉండటంతో గత్యంతరం లేని స్థితిలో సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలు అయ్యారు. అయినా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు సరికదా కాంగ్రెస్ గ్రాఫ్ కిందకు దిగజారుతూనే వస్తుంది. పార్టీ అధికారం సాధించిన మధ్యప్రదేశ్ లో ఆ స్థానం నిలబెట్టుకోలేక ప్రతిపక్షం లోకి వెళ్ళిపోయింది. ఇక రాజస్థాన్ లో తృటిలో అలాంటి పరిస్థితిని తప్పించుకుంది. ఈ రెండు చోట్లా పార్టీలోని యువ నాయకత్వాలు అధిష్టానం పై చేసిన తిరుగుబాటు స్పష్టంగా కనిపిస్తుంది.

మేలుకోకపోతే మొదటికే మోసమని …

ఇంత జరిగిన తరువాతైనా మేలుకోకపోతే బిజెపి దూకుడు ముందు దేశ వ్యాప్తంగా మరింత గడ్డు పరిస్థితి తప్పదని గ్రహించి పార్టీ అత్యున్నత సమావేశం ఏర్పాటు చేస్తే సీనియర్లు లేఖ ద్వారా రేపిన అలజడి అంతా ఇంతా కాదు. ఇదే అదనుగా తాను అనుకున్న విధంగా పార్టీని తీర్చిదిద్దేసమయం రానేవచ్చింది అని గుర్తించి రాహుల్ గులాం నబీ ఆజాద్ వంటివారికి చురకలు అంటించారు. కొత్తవారికి అవకాశాల్లేకుండా ఎన్నాళ్ళు చూరు పట్టుకు వేళ్ళాడతారు అనే రకంగానే సీనియర్లకు గట్టిగానే చురకలు అంటించారంటున్నారు విశ్లేషకులు. తాను కాంగ్రెస్ కు రాజీనామా చేయలేదని గులాం నబీ ఆజాద్ తర్వాత ప్రకటించారు. కాంగ్రెస్ సిడబ్ల్యు సి సమావేశంలో నడిచిన చర్చ కొత్త రక్తం ఎక్కించేందుకు అన్నది సీనియర్లకు అర్థమైనా అర్ధం కానట్లే చాలామంది నటిస్తున్నారని తేలిపోయింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ రాబోయే రోజుల్లో దూకుడు గా ముందుకు సాగనుందా ? లేక మరింత చతికిల పడనుందా అన్నది తేలిపోనుంది. సీడబ్ల్యూసీ సమావేశం తర్వాత గులాంనబీ ఆజాత్ ఇంట్లో అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీనియర్ నేతలు హాజరుకావడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News