రాయపాటికి ఛాన్స్ దొరికిందిగా

రాజ‌కీయాల్లో ప్రత్యర్థుల నుంచి వ‌చ్చే ఆటుపోట్లను త‌ట్టుకోవ‌డం ఒక ఎత్తయితే.. స్వయంకృతంగా చేసుకున్న కొన్ని ప‌నులు కూడా నాయ‌కుల‌ను మ‌రింత‌గా ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే [more]

Update: 2019-08-22 14:30 GMT

రాజ‌కీయాల్లో ప్రత్యర్థుల నుంచి వ‌చ్చే ఆటుపోట్లను త‌ట్టుకోవ‌డం ఒక ఎత్తయితే.. స్వయంకృతంగా చేసుకున్న కొన్ని ప‌నులు కూడా నాయ‌కుల‌ను మ‌రింత‌గా ఇబ్బంది పెడుతుంటాయి. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్రసాద‌రావు. ఆయ‌న రాజ‌కీయ చ‌ర‌మాంకంలో ఎదుర్కొంటున్న ఆటుపోట్లు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటి వ‌ర‌కు ప‌రిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం మాత్రం ఆయ‌న అటు పార్టీలోను, ఇటు బ‌య‌ట కూడా తీవ్రమైన వ్యతిరేక‌త‌ను చ‌విచూస్తున్నారు. తాను స్వయంగా చేసుకున్న ప‌నులే ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ భ‌విష్యత్తుకు ఉరితాడుగా మారాయ‌ని అంటున్నారు.

ఓటమిపాలయిన తర్వాత…..

విష‌యంలోకి వెళ్తే.. ఎప్పుడో దివంగ‌త మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్థాపించిన స‌మ‌యంలో టీడీపీలోకి అరంగేట్రం చేసిన కోడెల.. అప్పట్లో వైద్య వృత్తిని సైతం వ‌దులుకుని రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. న‌ర‌స‌రావుపేట నుంచి ప‌లుమార్లు గెలిచిన ఆయ‌న నంద‌మూరి ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా పేరు తెచ్చుకున్నారు. మంత్రిగా, పార్టీలో కీల‌క నాయ‌కుడిగా ఆయ‌న గుర్తింపు సాధించారు. ఇక‌, పార్టీ సంక్షోభ స‌మ‌యంలో చంద్రబాబుకు జై కొట్టిన కోడెల‌.. ఇటీవ‌లి వ‌ర‌కు అసెంబ్లీ స్పీక‌ర్గా ఉన్నారు. బీజేపీ-టీడీపీ పొత్తులో భాగంగా న‌ర‌స‌రావుపేట‌ను వ‌దులుకు 2014లో స‌త్తెన‌ప‌ల్లి టికెట్ నుంచి బ‌రిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థి అంబ‌టి రాంబాబుపై 780 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు.

అన్నీ ఆరోపణలే….

ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో చ‌చ్చీచెడీ టికెట్ సాధించినా.. విజ‌యం అందుకోలేక పోగా.. ఎన్నిక‌ల రోజు.. పోలింగ్ బూత్‌లో ఘ‌ర్షణ స‌మ‌యంలో చొక్కా చిరిగి, క‌ళ్ల అద్దాలు ప‌గిలే వ‌ర‌కు వివాదం చోటు చేసుకుంది. అయినా సింప‌తీ ఓట్లు ఆయ‌న‌ను కాపాడ‌లేక పోయాయి. దీంతో ప‌రాజ‌యం పాల‌య్యారు. రాష్ట్రంలో అధికారం మారింది. దీంతో గ‌డిచిన ఐదేళ్లలో కోడెల కుటుంబం అటు స‌త్తెన‌ప‌ల్లి, ఇటు న‌ర‌స‌రావుపేట‌ల్లో చేసిన ఆగ‌డాలు, భూకబ్జాలు, వ‌సూళ్ల ప‌ర్వాల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఇవ‌న్నీ ఒక ఎత్తయితే.. ఏకంగా అసెంబ్లీకి సంబంధించిన ఫ‌ర్నిచ‌ర్‌, ఏసీల‌ను త‌న ఇంటికి త‌ర‌లించుకోవ‌డం ఇప్పుడు మ‌రింత మైన‌స్‌గా మారింది.

రాయపాటి చేతిలో…..

దీనిని కోడెల స్వయంగా ఒప్పుకోవ‌డం మ‌రింత‌గా ఇప్పుడు ఆయ‌న‌ను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ నేథ్యంలో అటు పార్టీ ప‌రువు పోగా, వ్యక్తిగ‌త ప‌రువు ఏనాడో మంట‌గిలిసింది. ఈ నేప‌థ్యంలోనే చంద్రబాబు ఇక‌, ఆయ‌న‌ను ప‌క్కన పెట్టాల‌ని నిర్ణయించుకున్నారు. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. గుంటూరు జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌, రాజ‌కీయ దిగ్గజం రాయ‌పాటి సాంబ‌శివ‌రావు.. టీడీపీకి బై చెప్పాల‌ని నిర్ణయించుకున్న‌ట్టు వార్తలు వ‌స్తున్నాయి. దీంతో ఈ కుటుంబాన్ని ఓదార్చి, బుజ్జగించి పార్టీలోనే కొన‌సాగేలా చేసుకునేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే కోడెల ఓడిపోయిన‌స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాన్ని రాయ‌పాటి చేతిలో పెట్టాల‌ని బాబు డిసైడ్ అయ్యార‌ని స‌మాచారం.

బాబు సంకేతాలు….

ఇప్పటికే దీనికి సంబందించి రాయ‌పాటి వ‌ర్గానికి సంకేతాలు కూడా అందాయ‌ని అంటున్నారు. అటు న‌ర‌స‌రావుపేటలోను, ఇటు స‌త్తెన‌ప‌ల్లిలోనూ కూడా కోడెల హ‌వా దీంతో తుడిచి పెట్టుకుపోయింద‌ని చెబుతున్నారు. ఇంత జ‌రుగుతున్నా కోడెల ను స‌మ‌ర్ధించేవారు కానీ, కోడెల త‌ర‌పున మాట్లాడే టీడీపీ నేత కానీ క‌నిపించ‌క‌పోగా.. ఇప్పుడు పీఠ‌మే క‌దిలిపోయే ప‌రిస్థితి దాపురించింందంటే.. అసలు పార్టీలోనే ఆయ‌న‌పై వ్యతిరేక‌త ఏ రేంజ్‌లో ఉందో ఇట్టే అర్ధమ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి గుంటూరులో కోడెల కోట‌కు బీట‌లు ప‌డ్డాయ‌నే మాట వినిపిస్తోంది.

ఇప్పటికే అనధికారికంగా….

అదే టైంలో ఎన్నిక‌ల‌కు ముందే స‌త్తెన‌ప‌ల్లి సీటుపై క‌న్నేసిన రాయ‌పాటి వార‌సుడు రంగారావు ప్రస్తుతం స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కార్యక్రమాల్లో అన‌ధికారికంగా పాల్గొంటున్నారు. కోడెల వ్యతిరేక‌వ‌ర్గం అంతా రంగారావును పార్టీతో సంబంధం లేకుండా ఆమ నియోజ‌క‌వ‌ర్గానికి ఆహ్వానించి మ‌రీ ఇక్కడ నాయ‌క‌త్వం వ‌హించాల‌ని కోరుతుండ‌డం విశేషం. రంగారావు కూడా నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ఫ్యామిలీకి ఉన్న విస్తృత ప‌రిచ‌యాల‌తో ముందుకు క‌దులుతున్నారు. ఏదేమైనా స‌త్తెన‌ప‌ల్లి టీడీపీ రాజ‌కీయం ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News