ఎక్కడ కొట్టాలో తెలుసుగా

కోడెల శివప్రసాద్, రాయపాటి సాంబశివరావుల మధ్య వివాదం ఈ నాటిది కాదు. కోడెల శివప్రసాద్ కు, రాయపాటి సాంబశివరావుకు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు కోడెల [more]

Update: 2019-08-10 06:30 GMT

కోడెల శివప్రసాద్, రాయపాటి సాంబశివరావుల మధ్య వివాదం ఈ నాటిది కాదు. కోడెల శివప్రసాద్ కు, రాయపాటి సాంబశివరావుకు ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు కోడెల కష్టాల్లో ఉండటంతో రాయపాటి సాంబశివరావు మరోసారి ఆథిపత్యాన్ని ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు. అవును.. ఇప్పుడు కోడెల శివప్రసాద్ కష్టాల్లో ఉన్నారు. ఆయన కుటుంబసభ్యులపై వరసగా కేసులు నమోదవుతున్నాయి. పార్టీకి కూడా కోడెల శివప్రసాదరావు తలనొప్పిగా మారారు. కోడెలను వదిలించుకోవాలని చంద్రబాబు కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కోడెలను తప్పించి….

తాజాగా సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా కోడెల శివప్రసాద్ ను తప్పించాలని ఆ ప్రాంత టీడీపీ నేతలు చంద్రబాబును కలిసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కూడా వారితో తాను కోడెల విషయంలో ఒక నిర్ణయానికి త్వరలో రానున్నట్లు తెలిపారు. సత్తెన పల్లి నియోజకవర్గంలో ఎన్నికలకు ముందే కోడెలపై ఫిర్యాదు చేశారు కొంతమంది టీడీపీ నేతలు. టిక్కెట్ ఇవ్వవద్దంటూ గోలగోల చేశారు. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఇప్పుడు కోడెల కుటుంబంపై వరస కేసులు నమోదవుతుండటంతో పక్కన పెట్టాలని భావిస్తున్నారు. అందుకు ప్రత్యామ్నాయ నేతగా రాయపాటి రంగారావును ఖరారు చేయాలని యోచిస్తున్నారు.

అసంతృప్త నేతలతో….

రాయపాటి సాంబశివరావు తనయుడు రాయపాటి రంగారావు సత్తెనపల్లి టీడీపీ అసంతృప్త నేతలతో సమావేశమవుతున్నారు. వారిని తనవైపునకు తిప్పుకునేందుకు రాయపాటి ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లోనూ సత్తెనపల్లి టిక్కెట్ కోసం రాయపాటి రంగారావు ప్రయత్నించారు. అయితే కోడెలను కాదని రాయపాటి రంగారావుకు టిక్కెట్ ఇచ్చే ధైర్యం చంద్రబాబు చేయలేకపోయారు. అయితే రాయపాటికి, కోడెలకు మధ్య వివాదం ఈనాటిది కాదంటున్నారు వారిద్దరినీ బాగా తెలిసిన వ్యక్తులు.

ఎంపీ ల్యాడ్స్ నిధుల వివాదం…..

రాయపాటి సాంబశివరావు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నకాలంలో ఆయన ఎంపీ ల్యాడ్స్ నిధుల పనులను కూడా ఎవరికీ ఇవ్వనిచ్చే వారు కాదట కోడెల. తన కుటుంబమే చేసుకోవాలని షరతు పెట్టారట. సత్తెనపల్లిలో కోట్లాది రూపాయలు ఎంపీ ల్యాడ్స్ నిధులను కోడెల కుటుంబ సభ్యులే చేశారట. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తనకు ఎన్నికల నిధులు ఇవ్వాలని కోడెల కోరితే… ఐదేళ్ల పాటు తిన్నది చాలదా? అని రాయపాటి ప్రశ్నించారట. సత్తెనపల్లిలో కోడెల కేవలం తనను గెలిపించమనే ప్రచారం చేసుకున్నారని రాయపాటి ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు సమయం రావడంతో కుమారుడిని సత్తెనపల్లి టీడీపీ ఇన్ ఛార్జిగా చేసేందుకు రాయపాటి సాంబశివరావు ప్రయత్నిస్తున్నారనిటాక్.

Tags:    

Similar News