రాయపాటి అందుకే దూరంగా ఉన్నారా?

తెలుగుదేశం పార్టీలో సీినియర్ నేతలు ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో సీనియర్ నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబుకు [more]

Update: 2021-06-15 05:00 GMT

తెలుగుదేశం పార్టీలో సీినియర్ నేతలు ఒక్కొక్కరుగా సైలెంట్ అయిపోతున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో సీనియర్ నేతలు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబుకు దన్నుగా నిలవడం లేదు. రాజకీయాలంటే తమకు పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. అందులో ముఖ్యంగా రాయపాటి సాంబశివరావు ఒకరు. రాయపాటి గుంటూరు జిల్లాలో సీనియర్ నేత. ఆయనకు ఇప్పటికీ వ్యక్తిగత ఓటు బ్యాంకు ఉంది.

పట్టున్న ప్రాంతంలో….?

నరసరావుపేట, గుంటూరు ప్రాంతాల్లో పట్టున్న రాయపాటి సాంబశివరావు గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్నారు. ఆయన పార్టీ మారాలనుకున్నా అది సాధ్యం కాలేదు. ఆయన బీజేపీలో చేరాలనుకున్నారు. స్వయంగా రామ్ మాధవ్ వచ్చి రాయపాటి సాంబశివరావుతో మంతనాలు జరిపారు. దీంతో ఆయన బీజేపీలో చేరడం ఖాయమయిందని భావించారు. కానీ ఇప్పటి వరకూ రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరలేదు.

బీజేపీలో చేరాలనుకున్నా…?

రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభ్యంతరాలు వెలువడటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు రాయపాటి సాంబశివరావు జిల్లాను శాసించారనే చెప్పాలి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, టీడీపీ పవర్ లో ఉన్న ప్పుడు ఆయనదే పై చేయి అయింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పట్ల కూడా రాయపాటి సాంబశివరావు సంతృప్తి కరంగా లేరు. చంద్రబాబు తనకు తన కుటుంబానికి ప్రయారిటీ ఇవ్వడం లేదని రాయపాటి సాంబశివరావు నమ్ముతున్నారు.

బాబుపై ఆగ్రహంతోనే?

అందుకే ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని తెలిసింది. రాయపాటి సాంబశివరావు వచ్చే ఎన్నికల నాటికి వయసు రీత్యా పోటీ చేయడం కష్టమే. తన కుమారుడు రంగారావు రాజకీయ భవిష్యత్ పైనే ఆయన బెంగంతా. అందుకోసమే సత్తెనపల్లి ఇన్ ఛార్జి ఇవ్వాలని చాలా రోజుల నుంచి రాయపాటి సాంబశివరావు చంద్రబాబును కోరుతున్నారు. కానీ చంద్రబాబు దీనిపై నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో రాయపాటి సాంబశివరావు పార్టీకి దూరంగా ఉంటున్నారని తెలిసింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కూడా రాయపాటి సాంబశివరావు పట్టించుకోకపోవడానికి ఇదే కారణమంటున్నారు.

Tags:    

Similar News