పట్టించుకోవడం లేదా?

మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదా? తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం రాయపాటి సాంబశివరావు ఎలాంటి [more]

Update: 2019-11-09 12:30 GMT

మాజీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు ఎటూ తేల్చుకోలేకపోతున్నారా? ఆయన ఓటమి నుంచి ఇంకా తేరుకోలేదా? తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం రాయపాటి సాంబశివరావు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇదే చర్చ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ జరుగుతోంది. రాయపాటి సాంబశివరావు సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నేత కావడంతో అన్ని పార్టీలూ ఆయన రాకను స్వాగతిస్తాయి. కానీ కొన్నాళ్లుగా పరిస్థితిని చూస్తుంటే రాయపాటి సాంబశివరావును పట్టించుకునే వారు లేకుండా పోయారు.

టీడీపీ నుంచిగెలిచి…

రాయపాటి సాంబశివరావు గుంటూరు పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పారు. ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కకపోయినా అదే హోదాలో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో తిరిగే వారు. అయితే రాష్ట్ర విభజనతో రాయపాటి సాంబశివరావు కాంగ్రెస్ కు ఇక్కడ చోటులేదని గ్రహించి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. టీడీపీ నుంచి 2014 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేద్దామని భావించినా చంద్రబాబు రాయపాటి సాంబశివరావును నరసరావుపేట కు పంపారు. అక్కడి నుంచి గెలిచిన రాయపాటి సాంబశవరావు తన రాజకీయ జీవితానికి ఢోకా లేదని భావించారు.

వైసీపీలోకి వెళ్లాలనుకున్నా….

కానీ 2019 ఎన్నికలకు ముందు రాయపాటి సాంబశివరావు పార్టీ మారాలని భావించారు. వైసీపీలోకి వెళ్లాలని ఒకదశలో ఊగారు. కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ నుంచి డ్రాప్ అయ్యారని తెలుసుకున్న రాయపాటి సాంబశివరావు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లారు. దీంతో పాటు చంద్రబాబునాయుడు తన కుమారుడు రాయపాటి రంగబాబుకు సత్తెనపల్లి టిక్కెట్ ఇవ్వకపోవడం ఆయన ఆగ్రహానికి కారణమయింది. అయితే నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి సాంబశివరావు ఘోరంగా ఓటమి పాలయ్యారు. అయితే సామాజిక వర్గం పెద్దలు రాయపాటిని వైసీపీలోకి వెళ్లకుండా ఆపగలిగారంటారు.

బీజేపీ కూడా….

ఓటమి తర్వాత రాయపాటి సాంబశివరావు బీజేపీలోకి వెళ్లాలని ప్రయత్నించారు. రామ్ మాధవ్ రాయపాటి ఇంటికి వెళ్లి చర్చించి వచ్చారు. రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని రాయపాటి సాంబశివరావు అప్పట్లో చెప్పారు. కానీ మూడు నెలలు దాటుతున్నా రాయపాటి సాంబశివరావును ఎవరూ పట్టించుకోలేదు. ఆయనను పార్టీలోకి తీసుకుని ఏం లాభమన్న చర్చ బీజేపీలోనూ నడిచిందట. అంతేకాకుండా కన్నా కూడా మోకాలడ్డటంతో రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరిక ఆగిపోయింది. మొత్తం మీద రాయపాటి సాంబశివరావును ఏపీలో ఏ పార్టీ పట్టించుకోవడం లేదన్నది మాత్రం వాస్తవం.

Tags:    

Similar News