రాయపాటికి ఈసారైనా ఛాన్స్ ఉంటుందా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటిలా ఉంది. ఆయన ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల జరిగిన సీబీఐ దాడులతో [more]

Update: 2020-12-28 15:30 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు అనుకున్నది ఒకటి జరుగుతుంది మరొకటిలా ఉంది. ఆయన ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయారు. ఇటీవల జరిగిన సీబీఐ దాడులతో రాయపాటి సాంబశివరావు మరింత కుంగిపోయారు. బ్యాంకు రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసులో రాయపాటి ఇంట్లోనూ, ఆయనకు చెందిన ట్రాన్స్ ట్రాయ్ కంపెనీపై సీబీఐ సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

కేసులో కూరుకుపోయి….

అయితే ఈ కేసులో రాయపాటి సాంబశివరావుకు ఉచ్చు బిగుసుకుపోతున్నట్లు తెలుస్తోంది. రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రన్స్ ట్రాయ్ సంస్థ 18బ్యాంకుల నుంచి 8,836 కోట్ల రూపాయలను రుణాలను తీసుకుని ఎగ్గొట్టిన కేసులో ఆయనపై కేసు నమోదయింది. ఇది ఆర్థికంగా రాయపాటి సాంబశివరావుకు తీవ్ర నష్టమే. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆయనకు ఈ సీబీఐ కేసులు మరింత కష్టాలు పాలు చేస్తాయి.

బీజేపీలో చేరదామనుకున్నా….

అందుకే రాయపాటి సాంబశివరావు బీజేపీలో చేరదామనుకున్నారు. సుజనా చౌదరి తరహాలోనే తాను కూడా బీజేపీ లో చేరితే సీబీఐ కేసుల నుంచి కొంత ఉపశమనం పొంద వచ్చని భావించారు. కానీ బీజేపీలో చేరేందుకు రాయపాటి సాంబశివరావు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రామ్ మాధవ్, సోము వీర్రాజు వంటి నేతలతో ఆయన సత్సంబంధాలు కొనసాగించినా ఆయన చేరిక విషయంలో ఒక కీలక నేత అడ్డుపడినట్లు తెలుస్తోంది.

మరోసారి ప్రయత్నం…..

ఇప్పుడు సీబీఐ కేసుల్లో పీకల్లోతులో కూరుకుపోయిన రాయపాటి సాంబశివరావు మరోసారి తన ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. ఢిల్లీలో ఉన్న తన పరిచయాలతో ఆయన బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే రాయపాటి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కొద్ది నెలలుగా దూరంగా ఉంటూ వస్తుంది. రాయపాటి సాంబశివరావు త్వరలోనే ఢిల్లీ వెళతారన్న ప్రచారం జరుగుతుంది. మరి ఈసారైనా రాయపాటి సాంబశివరావు కాషాయ కండువా కప్పుకుంటారో? లేదో చూడాలి.

Tags:    

Similar News