రాయపాటికి బ్రేక్ వేసిందెవరు..?

రాయపాటి సాంబశివరావు పార్టీ మారాలన్న యోచనను విరమించుకున్నారా? లేక మరికొంతకాలం ఆగాలని భావిస్తున్నారా? చంద్రబాబునాయుడు బుజ్జగింపులలో రాయపాటి మెత్తబడ్డారా? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చగా మారింది. [more]

Update: 2019-08-08 00:30 GMT

రాయపాటి సాంబశివరావు పార్టీ మారాలన్న యోచనను విరమించుకున్నారా? లేక మరికొంతకాలం ఆగాలని భావిస్తున్నారా? చంద్రబాబునాయుడు బుజ్జగింపులలో రాయపాటి మెత్తబడ్డారా? ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చగా మారింది. తెలుగుదేశం పార్టీ ఇటీవల జరిగిన ఘోర ఓటమితో నేతల నుంచి క్యాడర్ వరకూ నిస్తేజంలో పడిపోయారు. అనేకమంది నేతలు పార్టీని వీడుతున్నారు. రాయపాటి సాంబశివరావు లాంటి నేతలు కూడా పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు.

బాబు బుజ్జగింపులతో….

దీంతో చంద్రబాబునాయుడు పార్టీని వీడాలనుకుంటున్న నేతలతో మాట్లాడుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా రాయపాటి సాంబశివరావు పార్టీని వీడుతున్నట్లు సంకేతాలిచ్చారు. తాను త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు కూడా రాయపాటి బహిరంగంగానే తెలిపారు. కానీ రాయపాటి చేరికకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఒకటి చంద్రబాబు బుజ్జగింపులు కారణం కాగా, మరొకటి రాయపాటి ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ కారణమన్న వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా వినపడుతున్నాయి.

బీజేపీలో చేరాలని….

రాయపాటి సాంబశివరావు సామాజిక పరంగా, ఆర్థికంగా బలమైన నేత. ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన నిర్వేదంలోకి వెళ్లిపోయారు. వ్యాపారాల పరంగా కూడా దెబ్బతిన్నారు. స్వయంగా రామ్ మాధవ్ వచ్చి తనను ఆహ్వానించడంతో రాయపాటి సంబరపడి పోయారు. కమలం పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. చంద్రబాబునాయుడిని నేరుగా కలసి తన పరిస్థితిని వివరించారు. చంద్రబాబు కూడా ఆలోచించుకోమని చెప్పారట.

కన్నా పట్టుబట్టడం వల్లనేనా..?

కానీ పది రోజులు గడుస్తున్నా హస్తిన నుంచి పిలుపు రాలేదు. దీంతో రాయపాటి చేరికకు బ్రేక్ పడినట్లే నని చెబుతున్నారు. తనకు రాయపాటి చేరిక విషయం తెలియదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కన్నా లక్ష్మీనారాయణ రాయపాటి చేరికపై అధిష్టానం వద్ద విముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. చంద్రబాబు కూడా రాయపాటిని బుజ్జగించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తనయుడు రాయపాటి రంగారావుకు మంచి పొజిషన్ ఇస్తానని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. మొత్తం మీద రాయపాటి చేరికకు బ్రేక్ పడిందనేది మాత్రం వాస్తవం అంటున్నారు కమలం పార్టీ నేతలు.

Tags:    

Similar News