కలసి వస్తే రాయపాటికి ఛాన్స్ దక్కుతుందట

ఈ నెల ఆఖ‌రున తేలిపోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం, కార్పొరేష‌న్లకు మేయ‌ర్ల ఎంపిక జ‌రుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే కీల‌క‌మైన జిల్లాగా ఉన్న గుంటూరులో [more]

Update: 2020-03-19 00:30 GMT

ఈ నెల ఆఖ‌రున తేలిపోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం, కార్పొరేష‌న్లకు మేయ‌ర్ల ఎంపిక జ‌రుగుతుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోనే కీల‌క‌మైన జిల్లాగా ఉన్న గుంటూరులో మేయ‌ర్ ప‌ద‌విని కైవ‌సం చేసుకునేందుకు టీడీపీ త‌ర‌ఫున డాక్టర్ రాయ‌పాటి శైలజ ముందున్నారు. ఈమె మాజీ ఎంపీ, రాజ‌కీయ దిగ్గ జం రాయ‌పాటి సాంబ‌శివ‌రావు సోద‌రుడి కుమార్తె. ప్రస్తుతం ఈమె అమ‌రావ‌తి రాజ‌ధాని ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో ఆమె జేఏసీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. మూడు రాజ‌ధానుల ప్రతిపాద‌న‌ను తీవ్రంగా వ్యతిరేకించ‌డంతోపాటు మ‌హిళ‌ల‌కు అండగా ఉంటున్నారు. దీంతో పాటు త‌న కుటుంబానికి ఉన్న రాజ‌కీయ ఛ‌రిష్మా నేప‌థ్యంలోనూ రాజ‌ధాని మార్పు గుంటూరు జిల్లాపై తీవ్రంగా ఉండ‌డంతో తాను గెల‌వ‌డంతో పాటు గుంటూరు మేయ‌ర్ కూడా అవుతాన‌న్న ధీమాతో ఉన్నారు.

ఎమ్మెల్యే అవ్వాల్సింది?

అదే స‌మ‌యంలో వైసీపీ త‌ర‌ఫున ఇద్దరు కీల‌క నాయ‌కులు పోటీ ప‌డుతున్నారు. మేయ‌ర్ రేసులో మాజీ మిర్చి యార్డు చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి, కావ‌టి మ‌నోహ‌ర‌నాయుడులు నువ్వా-నేనా అనే రేంజ్‌లో ఉన్నారు. లేళ్ల అప్పిరెడ్డి విష‌యానికి వ‌స్తే.. ఈయ‌న సీనియ‌ర్ నాయ‌కుడు. వైసీపీలో వైఎస్ కుటుంబానికి ప్రాణం ఇచ్చే నేత‌గా గుర్తింపు సాధించారు. అప్పిరెడ్డికి ఏ ప‌ద‌వి లేక‌పోయినా జ‌గ‌న్ ఆయ‌న‌కు ఎంతో ప్రయార్టీ ఇస్తారు. అందుకే జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలా మంది అనేక ప‌నుల కోసం ఆయ‌న చుట్టూ ప్రద‌క్షిణ‌లు చేస్తున్నారు.

రాజకీయంగా ఎదగాలని…..

గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న గుంటూరు ప‌శ్చిమ సీటు చంద్రగిరి యేసుర‌త్నంకు త్యాగం చేశారు కూడా. ఈ క్రమంలో అప్పట్లో నే జ‌గ‌న్ ఈయ‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. మ‌ధ్యలో ఆయ‌న‌కు మిర్చి యార్డు చైర్మన్ ఆఫ‌ర్ చేసిన‌ప్పుడు సైతం త‌న‌కు ఎమ్మెల్సీయే కావాల‌ని అప్పిరెడ్డి ప‌ట్టుబ‌ట్టడంతో ఆ ప‌ద‌వి రాలేదు. మిర్చి యార్డు చైర్మన్ ప‌ద‌విని ప‌శ్చిమ ఇన్‌చార్జ్ యేసుర‌త్నంకు ఇచ్చారు. దీంతో ఇప్పుడు మండ‌లి ర‌ద్దు అవ్వడంతో మేయ‌ర్ పీఠంపై లేళ్ల ఆశ‌లు పెట్టుకున్నారు. ఈ ప‌ద‌వితో జిల్లాలో మ‌ళ్లీ రాజ‌కీయంగా ఓ వెలుగు వెల‌గాల‌న్నదే ఆయ‌న ప్లాన్‌గా ఉంది.

ఇద్దరిలో ఒకరికే?

అయితే, అదేస‌మ‌యంలో కావ‌టి మ‌నోహ‌ర్ కూడా మేయ‌ర్ పీఠంపై ఆశ‌లు పెట్టుకున్నారు. పార్టీలో చురుగ్గా ఉండే కావ‌టి… ఎన్నిక‌ల‌కు ముందు పెద కూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గానికి ఇంచార్జ్‌గా చేశారు. అయితే, అక్కడ నంబూరు శంక‌ర‌రావు ఆగ‌మ‌నంతో ఆయన త‌ప్పుకొన్నారు. ఆ టైంలో ఆయ‌న‌కు జ‌గ‌న్ ఎమ్మెల్సీ ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఇద్దరు నాయ‌కులు కూడా మేయ‌ర్ రేసులో ముందున్నారు. ఇక‌, ఇదిలా వుంటే, జ‌న‌సేన‌, బీజేపీలు కూడా ఈ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన ప‌క్షంగా రంగంలోకి దిగుతున్నాయి. ఇక‌, రాజ‌ధాని ఎఫెక్ట్ భారీగా ఉండ‌డం గ‌మ‌నార్హం. దీంతో గుంటూరు మేయ‌ర్ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుంద‌నే విష‌యం ఆస‌క్తిగా మారింది.

Tags:    

Similar News