ఉన్న ఒక్కడూ ఇలా అయ్యారేంటి?

జ‌న‌సేన పార్టీలో వింత వైఖ‌రి క‌నిపిస్తోంది. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు రాజ‌కీయాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆయ‌న ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. రెండు [more]

Update: 2019-12-12 06:30 GMT

జ‌న‌సేన పార్టీలో వింత వైఖ‌రి క‌నిపిస్తోంది. పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ దూకుడు రాజ‌కీయాలు చేస్తున్నారు. వాస్తవానికి ఆయ‌న ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిన ప‌వ‌న్ కల్యాణ్ రెండు చోట్లా ఓట‌మిపాలు కావ‌డంతో పార్టీలో తీవ్ర గంద‌ర‌గోళం ఏర్పడింది. అయితే, ఓట‌మి నుంచి వెంట‌నే తేరుకున్న ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన జ‌గ‌న్‌ను తొలి వారం నుంచే టార్గెట్ చేయ‌డం ప్రారంభించారు. ఇసుక పై లాంగ్ మార్చ్ అంటూ విశాఖ‌లో భారీ ఎత్తున ప‌వ‌న్ కల్యాణ్ హ‌డావుడి చేశారు. ఇక‌, త‌ర్వాత కూడా తీవ్రస్థాయిలో విమ‌ర్శలు గుప్పించారు. తెలుగు మాధ్యమం ఎత్తివేత‌పై.. ఇంగ్లీషు మీడియం జైలు జీవితాన్ని నేర్పిందా? అని ప్రశ్నించారు.

సభలో వైలెంట్ గా…..

ఇక‌,తాట తీస్తా.. తోలు తీస్తా.. అంటూ చేస్తున్న వ్యాఖ్యలు కామ‌న్‌. అదే స‌మ‌యంలో రైతుల త‌ర‌ఫున ప్రస్తుతం గ‌ళం విప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప‌ర్యటిస్తున్నారు. ఎక్కడిక‌క్కడ స‌భ‌లు పెట్టి జ‌గ‌న్‌ను తిట్టే కార్యక్రమం చేస్తున్నారు. మ‌రి ఇంత‌గా ఓడిపోయిన ప‌వ‌న్ కల్యాణ్ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తుంటే.. ఆ పార్టీలో నెగ్గిన ఎమ్మెల్యే, రాజోలు నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాపాక వ‌ర‌ప్రసాద్ ప‌రిస్థితి ఏంటి? ఆయ‌న ఏ రేంజ్‌లో రెచ్చిపోవాలి ? ఏ విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి ? ఎలా దూకుడు ప్రద‌ర్శించాలి ? కానీ, రాపాక ఎక్కడా ఇలాంటి దూకుడు ప్రద‌ర్శించ‌డం లేదు. పైగా ఇంగ్లీష్ మీడియాన్ని సమర్థించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసించారు.

లైట్ గా తీసుకుంటున్నారా?

అటు అసెంబ్లీలోను, ఇటు బ‌య‌ట కూడా ఎక్కడా రాపాక వరప్రసాద్ ఒక్క విమ‌ర్శంటే ఒక్కటి కూడా చేయ‌డం లేదు. పైగా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో జ‌గ‌న్ చిత్రప‌టానికి పాలాభిషేకం చేసిన విష‌యం గుర్తుండే ఉంటుంది. మ‌రి ఆయ‌న వ్యూహం ఏంటో ఎవ‌రికీ అర్ధం కావ‌డం లేదు. ఇటీవ‌ల ఆయ‌న‌పై కేసు న‌మోదైన విష యం తెలిసిందే. ఇక‌, ప‌వ‌న్ కల్యాణ్ కూడా రాపాక విష‌యాన్ని లైట్‌గా తీసుకుంటున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఫొటోలు కూడా కన్పించడం లేదే…..

ఇటీవ‌ల ప‌వ‌న్ కల్యాణ్ రాజులులో ప‌ర్యటించిన‌ప్పుడు కూడా అక్కడి అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ప‌వ‌న్ కల్యాణ్ పొటోలు క‌నిపించాయే త‌ప్ప.. రాపాక ఫొటో ఒక్కటి కూడా ద‌ర్శన మివ్వక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక జ‌న‌సేన‌లో ఉన్న కీల‌క నాయ‌కుడు కూడా రాపాక‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. ఆయ‌న కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నుల కోసం జిల్లాకు చెందిన మంత్రుల‌తో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. ప్రస్తుతం రాపాక మంత్రి విశ్వరూప్ చెప్పిన‌ట్టు చేస్తున్నార‌ని స్థానికంగా టాక్ కూడా ఉంది. మ‌రి రాపాక ఐదేళ్లు జ‌న‌సేన‌లోనే ఉంటారా ? లేదా వంశీలా చేస్తారా ? అన్నది కాల‌మే ఆన్సర్ చేయాలి.

Tags:    

Similar News