ఈ జంపింగ్ ఎమ్మెల్యే పొలిటిక‌ల్ స్టోరీకి ఎండ్ కార్డ్ ?

రాపాక వ‌ర‌ప్రసాద్‌. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడే అయినా.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న అనుస‌రించిన వ్యూహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌నంటే ఎవ‌రో.. ఏం చేస్తున్నారో.. ప్రజ‌ల‌కు తెలిసింది. [more]

Update: 2021-09-10 12:30 GMT

రాపాక వ‌ర‌ప్రసాద్‌. సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడే అయినా.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న అనుస‌రించిన వ్యూహంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌నంటే ఎవ‌రో.. ఏం చేస్తున్నారో.. ప్రజ‌ల‌కు తెలిసింది. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆయ‌న జ‌న‌సేన త‌ర‌ఫున తూర్పు గోదావ‌రి జిల్లా రాజోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి.. జ‌గ‌న్ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అంతే కాదు.. ప‌వ‌న్ పెట్టిన పార్టీలో విజ‌యం సాధించిన ఏకైక ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ గుర్తింపుసాధించారు. ఆయ‌న అలా ఉండిపోయి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. అప్పటి అధికార వైసీపీకి ద‌గ్గర‌య్యేందుకు అష్టక‌ష్టాలు ప‌డ్డారు. పేకాట కేసులో త‌న వ‌ర్గాన్ని పోలీసులు అరెస్టు చేయ‌డంతో వైసీపీ స‌ర్కారుపై నిప్పులు చెరిగిన ఆయ‌న అనంత‌ర కాలంలో అదే పార్టీకి మ‌ద్దతుదారుగా మారిపోవ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయ‌న‌పై చ‌ర్చ వ‌చ్చింది.

వైసీపీకి అనుకూలంగానే..?

ఇక‌, అప్పటి నుంచి రాపాక వరప్రసాద్ వైసీపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. నిజానికి అప్ప‌టికేసులో రాపాక వరప్రసాద్ కు అనుకూలంగా జ‌న‌సేనాని ప‌వ‌న్ స్పందించారు. చిన్నపాటి వివాదాన్ని జ‌గ‌న్ ప్రభుత్వం రాజ‌కీయం చేస్తోంద‌ని అన్నారు. అదేవిధంగా ప్రధాన ప్రతిప‌క్షాల నుంచి కూడా రాపాక‌కు మద్దతు ల‌భించింది. కానీ, ఆయ‌న ఏమ‌నుకున్నారో.. ఏమో.. జ‌న‌సేన‌కు దూర‌మై.. వైసీపీకి ద‌గ్గర‌య్యారు. ఆ త‌ర్వాత‌.. స‌ద‌రు కేసు ఏమైందో తెలియ‌దు. ఇక‌, ఇప్పుడు అప్రక‌టిత‌.. వైసీపీ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ కొన‌సాగుతున్నారు. అంతేకాదు.. ఇటీవ‌ల కాలంలో వైసీపీ మంత్రుల‌తో క‌లిసి ప‌లు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ రాపాక క‌నిపిస్తున్నారు. వైసీపీ జెండా మోయ‌క‌పోయినా.. వైసీపీ నేత‌గా ఆయ‌న గుర్తింపు ద‌క్కించుకుంటున్నారు.

కలసి వస్తుందా?

అయితే.. ఇది రాపాక వరప్రసాద్ కు క‌లిసి వ‌స్తుందా ? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్రశ్న. ఎందుకంటే.. రాజోలు నియోజ‌క‌వ‌ర్గంలో వ‌చ్చే ఎన్నిక ల్లో టికెట్ ఆశించేవారు పెరిగిపోయారు. వీరంతా కూడా పార్టీకి ఎప్పటి నుంచో అండ‌గా ఉన్నవారు కూడా. వారిని కాద‌ని.. రాపాక వరప్రసాద్ కు అవ‌కాశం ఇస్తే.. పార్టీలో తిరుగుబాటు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. లేక‌పోతే.. క‌నీసం ఒక‌రిద్దరు.. స్వతంత్రులుగా పోటీకి దిగే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది. వైసీపీకి ద‌గ్గర అయినా రాపాక వరప్రసాద్ స్థానిక నేత‌ల‌తో క‌లివిడిగా లేక‌పోవ‌డం.. త‌న‌దే ఆధిప‌త్యం అంటూ.. వ్యాఖ్యలు సంధించ‌డం వంటి ప‌రిణామాలు.. వైసీపీ నేత‌ల‌కు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. దీంతో ఆ జంపింగ్ వ‌ల్ల.. పార్టీ నాశ‌నం కావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కాపు సామాజికవర్గం మొత్తం…?

మ‌రోవైపు.. రాపాక వరప్రసాద్ గెలుపున‌కు కృషి చేసిన‌.. ఎస్సీ యువ‌త‌.. ఇప్పటికీ జ‌న‌సేన‌తోనే ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక స‌మ‌రంలోనూ వీరు.. జ‌న‌సేన మ‌ద్దతిచ్చిన వారికే మొగ్గు చూపారు. కాపులు అంతా రాపాక వరప్రసాద్ పై మండి ప‌డుతున్నారు. స్థానిక ఎన్నిక‌ల్లో ఇక్కడ జ‌న‌సేన స‌త్తా చాటి ప‌ట్టు నిలుపుకుంది. వైసీపీలో అక్కడ ఎంపీ అనూరాధ‌, అమ్మాజీ, బొంతు రాజేశ్వర‌రావు వ‌ర్గాలు ఉన్నాయి. వీళ్లలో వీళ్లకే ప‌డ‌డం లేదు. ఈ గొడ‌వ‌లు మున్ముందు పెరిగి.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి రాపాక వరప్రసాద్ కు తీవ్ర ఇక్కట్లు త‌ప్పేలా లేవు. ఇటు వైసీపీ నేత‌ల‌తో పొస‌గ‌కపోవ‌డం.. మ‌రోవైపు.. జ‌న‌సేన‌కు దూరం కావ‌డం.. వంటివి రాపాక వరప్రసాద్ రాజకీయాల‌కు ఎండ్ కార్డు ప‌డేసేలా ఉన్నాయి.

Tags:    

Similar News