రాపాక కు దూల తీరిందా?

ఎప్పుడయినా పార్టీ మారితే ప్రజలు దానిని హర్షించరు. గతంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తే వారిలో ఒకరి భవిష్యత్ [more]

Update: 2021-03-05 08:00 GMT

ఎప్పుడయినా పార్టీ మారితే ప్రజలు దానిని హర్షించరు. గతంలోనూ వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేస్తే వారిలో ఒకరి భవిష్యత్ మాత్రమే రాజకీయంగా బాగుపడింది. అద్దంకి నియోజకవర్గం నుంచి గొట్టి పాటి రవికుమార్ పార్టీ మారినా తన సొంత బలంతో గెలవగలిగారు. మిగిలిన వారిలో కొందరు టిక్కెట్లు దక్కక పోటీ చేయకపోగా, పోటీ చేసిన వారంతా ఓటమి పాలయ్యారు. ఇదంతా ఎందుకంటే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు కూడా ఇప్పుడు తన పరిస్థితి ఏంటో అర్థం అయింది.

జనసేనకు దూరమై…..

2019 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి ఒకే ఒక ఎమ్మెల్యే విజయం సాధించారు. ఆయనే రాపాక వరప్రసాద్. రాజోలు నియోజకవర్గం నుంచి స్వల్ప మెజారిటీతో గెలిచిన రాపాక వరప్రసాద్ అనంతరం ఆ పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. వైసీపీకి పూర్తి మద్దతుదారుగా మారిపోయారు. తనను చూసి కాదని, జనసేన బలంతోనే గెలిచానని రాపాక వరప్రసాద్ పూర్తిగా విస్మరించారు.

లోపలా…బయటా…

అసెంబ్లీలోపల, బయట రాపాక వరప్రసాద్ జగన్ ను ప్రశంసిండమే పనిగా పెట్టుకున్నారు. జగన్ ఫొటోలకు పాలాభిషేకం చేశారు. ఆయన ఎంతవరకూ వెళ్లారంటే తాను బతికున్నంత వరకూ జగన్ నే ముఖ్యమంత్రి గా చూడాలని చెప్పడం. అయినా జనసేన ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చూసీ చూడనట్లు వదిలేసింది. తన కుమారుడిని అధికారికంగా రాపాక వరప్రసాద్ వైసీపీలో చేర్చారు. అయితే రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ రెంటికి చెడ్డ రేవడిగా మారారు.

ఎవరూ ఓన్ చేసుకోక పోవడంతో….

ఇటు వైసీపీ కార్యకర్తలు, నేతలు ఆయనను పట్టించుకోవడం లేదు. జనసేన కార్యకర్తలు పూర్తిగా దూరమయ్యారు. అయితే తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికలలో రాజోలులో జనసేన తన సత్తా చాటింది. పదిహేను పంచాయతీలను కైవసం చేసుకుంది. వైసీపీ నేతలు కూడా రాపాక వరప్రసాద్ కు సహకరించలేదు. సో పార్టీ మారినందున ఫలితాన్ని ఆయన పంచాయతీ ఎన్నికలలోనే చవిచూడాల్సి వచ్చింది. ఇక సాధారణ ఎన్నికల పరిస్థితి చెప్పనవసరం లేదు.

Tags:    

Similar News