పాశ్వాన్ దెబ్బ కొట్టనున్నారా?

తన కుమారుడిని రాజకీయంగా మరింత ఎదగనివ్వాలని రాం విలాస్ పాశ్వాన్ భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నది రాం విలాస్ [more]

Update: 2020-09-26 17:30 GMT

తన కుమారుడిని రాజకీయంగా మరింత ఎదగనివ్వాలని రాం విలాస్ పాశ్వాన్ భావిస్తున్నారు. బీహార్ రాజకీయాల్లో తన కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నది రాం విలాస్ పాశ్వాన్ గట్టిగా అనుకుంటున్నారు. అయితే నితీష్ కుమార్ ను ఇప్పటికే బీజేపీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. కానీ రాంవిలాస్ పాశ్వాన్ మాత్రం ఈ ప్రతిపాదనకు అంగీకరించడం లేదు.

కూటమిగా ఉన్నా….

ీబీహార్ లో బీజేపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ కూటమిగా వెళుతున్నాయి. లోక్ జనశక్తి పార్టీ ఎన్డీఏలో భాగస్వామి. రాంవిలాస్ పాశ్వాన్ కేంద్రమంత్రిగా కూడా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రతిపాదనను రాం విలాస్ పాశ్వాన్ అంగీకరించకపోవడం బీహార్ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో మిత్రుల మధ్య తలెత్తిన విభేదాలు కూటమికి కష్టాలు తెచ్చిపెట్టనున్నాయి.

ఆ ఫార్ములాకు…..

బీహార్ ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములా అనుసరించాలని నిర్ణయించింది. మొత్తం సీట్లలో జేడీయూ, బీజేపీ చెరి సగం తీసుకోవాల్సి ఉంది. బీజేపీ తనకు కేటాయించిన సీట్లలో కొన్నింటిని లోక్ జన్ శక్తి పార్టీకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ ఫార్ములాను రాంవిలాస్ పాశ్వాన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా నితీష్ కుమార్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంపై రాంవిలాస్ పాశ్వాన్ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తన కుమారుడికి…..

ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడమేంటని రాంవిలాస్ ప్రశ్నిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అనుసరించని పద్ధతిని ఇక్కడ ఎందుకు అవలంబిస్తున్నారో చెప్పాలని రాంవిలాస్ పాశ్వాన్ నిలదీస్తున్నారు. తన కుమారుడిని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో బీజేపీ కూటమిలో ఇలాంటి విభేదాలు రావడంతో ఎన్నికలపై ప్రభావం ఉంటుందంటున్నారు. మరి ఈ వివాదాన్ని ఏ విధంగా బీజేపీ అధిష్టానం పరిష్కరిస్తుందో చూడాలి.

Tags:    

Similar News