మరోసారి వర్మ సంచలనం సృష్టించారే ?

సంచలనాలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా అని ప్రకటించగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ సినిమాకు సిద్ధం అయ్యారు. ఆ [more]

Update: 2019-01-09 09:30 GMT

సంచలనాలకు దర్శకుడు రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు. బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ తీస్తా అని ప్రకటించగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట వర్మ సినిమాకు సిద్ధం అయ్యారు. ఆ తరువాత ఎన్టిఆర్ కధానాయకుడు ప్రీరిలీజ్ కార్యక్రమానికి ముందు రోజు వెన్నుపోటు పాత విడుదల చేసి తిరిగి వార్తల్లో నిలిచారు వర్మ. పోటాపోటీగా వర్మ నారా, నందమూరి కుటుంబాలకు ఎలాంటి మనః శాంతి దక్కకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ శరవేగంగా తెరమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నరు ఆర్జీవీ. తాజాగా ఎన్టీఆర్ మహానాయకుడు రిలీజ్ కి ముందు షోషల్ మీడియా లో వర్మ విడుదల చేసిన మరో పాట కొత్తదుమారానికి తెరతీయడం ఖాయంగా కనిపిస్తుంది.

లక్ష్మీపార్వతి నే ఎందుకు …?

సావిత్రి, అంజలీదేవి, కృష్ణ కుమారి, శ్రీదేవి, జయసుధ, జయప్రద వంటి అందగత్తెలను వదిలి లక్ష్మీపార్వతి నే ఎందుకు ఎందుకు అంటూ ఈ పాట మొదలైంది. చంద్రబాబు, బాలకృష్ణ దగ్గుబాటి ఉండగా, పురంధరేశ్వరి, హరికృష్ణ, భువనేశ్వరి వంటి కుటుంబం అంతా ఉండగా భర్త చాటున వుంటూ ఒక కొడుకు కూడా వున్న లక్ష్మీపార్వతిని ఎందుకు ఎందుకు అంటూ వర్మ సాహిత్యం సాగింది. అలాంటి వైశ్రాయి హోటల్ వద్ద వివాదం లోకి కూడా లక్ష్మీపార్వతినే ఎందుకు ఎన్టీఆర్ తీసుకువెళ్లారని ప్రశ్నిలు సంధించారు వర్మ. అలా సాగిన ఆయన పాటలో అనేక సందేహాలను ప్రేక్షకుల ముందు ఉంచారు చివరిలో ఆయన తన వ్యాఖ్యానంతో మరింత ఆసక్తిని పెంచి ఆకట్టుకున్నారు రామ్ గోపాల్ వర్మ. అబద్ధాల బట్టలు విప్పి ప్రజలముందు దోషిగా నగ్నంగా ఇలబెడతా నాటు సవాల్ విసిరారు వర్మ తాజా సాంగ్ పొలిటికల్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. షోషల్ మీడియా లో సైతం వైరల్ గా మారింది.

Tags:    

Similar News