అన్ని పార్టీలు మారి రికార్డు బ్రేక్

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత రమేష్ రాథోడ్ మరోసారి పార్టీ మారడం చర్చనీయాంశమైంది. ఆయన ఇప్పటికి దాదాపు అన్ని పార్టీలు మారారు. చివరకు ఇప్పుడు బీజేపీలో చేరారు. [more]

Update: 2021-06-22 09:30 GMT

ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నేత రమేష్ రాథోడ్ మరోసారి పార్టీ మారడం చర్చనీయాంశమైంది. ఆయన ఇప్పటికి దాదాపు అన్ని పార్టీలు మారారు. చివరకు ఇప్పుడు బీజేపీలో చేరారు. రమేష్ రాథోడ్ పార్టీలు మారడం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఆయన ఇప్పటికి టీడీపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. బలమైన నేతగా ముద్రపడిన రమేష్ రాథోడ్ ఇన్ని పార్టీలు మారడానికి కారణాలేంటి? అన్న చర్చ జరుగుతోంది.

ఒకప్పుడు బలమైన నేతగా…?

ఆదిలాబాద్ గిరిజన ప్రాంతంలో ఒకప్పుడు రమేష్ రాథోడ్ బలమైన నేతగా ఉండేవారు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆయన పార్లమెంటు సభ్యుడిగా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా అనేక పదవులు అనుభవించారు. అందుకే ఆయన 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనూ పార్టీ మారలేదు. తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఓటమితో టీడీపీకి ఇక్కడ సీన్ లేదని అర్థమయింది.

పార్టీలు మారి….

ఇక 2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరారు. ఖానాపూర్ అసెంబ్లీ టిక్కెట్ ను రమేష్ రాథోడ్ ఆశించారు. కానీ అప్పటికే కేసీఆర్ ఆ టిక్కెట్ ను కన్ఫర్మ్ చేయడంతో రమేష్ రాథోడ్ నిరాశకు లోనయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక కాంగ్రెస్ లో కూడా రమేష్ రాథోడ్ ఇమడ లేకపోయారు. చివరకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక్కడైనా ఇమడగలుగుతారా?

అయితే గతంలోలా గిరిజన ప్రాంతంలో ఉన్న పట్టు ఇప్పుడు రమేష్ రాథోడ్ కు లేదంటున్నారు. కొత్తతరం రావడం వారి ఆలోచనలు, పంథా వేరే రకంగా ఉండటంతో పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూసి ఓటేసే పరిస్థితి వచ్చిందంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉందని భావించి రమేష్ రాథోడ్ ఆ పార్టీలో చేరారు. మరి ఇక్కడైనా ఆయన ఇమడగలుగుతారా? లేదా? అన్నది ప్రశ్న. ఓటమిని ఆయన అంగీకరించరు. అందుకే రమేష్ రాథోడ్ ఇన్ని పార్టీలు మారాల్సి వచ్చింది.

Tags:    

Similar News