ఒక రాంగ్ స్టెప్ రాజకీయ జీవితాన్నే మార్చివేసిందే?

తెలంగాణ ఉద్యమం పీక్ దశలో ఉంది. ఆంధ్రపార్టీగా ముద్రపడిన టీడీపీ నేతలందరూ ముందుచూపుతో టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చేరిపోయారు. కానీ టీడీపీ తనకు అన్ని అవకాశాలిచ్చిందని భావించిన [more]

Update: 2021-02-02 00:30 GMT

తెలంగాణ ఉద్యమం పీక్ దశలో ఉంది. ఆంధ్రపార్టీగా ముద్రపడిన టీడీపీ నేతలందరూ ముందుచూపుతో టీఆర్ఎస్, కాంగ్రెస్ లో చేరిపోయారు. కానీ టీడీపీ తనకు అన్ని అవకాశాలిచ్చిందని భావించిన ఆ నేత మాత్రం టీడీపీనే నమ్ముకుని ఉండాలని వెయిట్ చేశారు. అదే ఆయనకు రాజకీయంగా శాపంగా మారింది. ఆయనే సీనియర్ నేత రమేష్ రాథోడ్. ఒకప్పుడు ఆదిలాబాద్ జిల్లా పేరు చెబితే రమేష్ రాథోడ్ పేరు తప్ప మరెవరి పేరు విన్పించేది కాదు.

ఆ పేరు ఎక్కడా?

కానీ ఇప్పుడు మాత్రం ఆ పేరే విన్పించడం లేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగినా రమేష్ రాథోడ్ టీడీపీలోనే ఉన్నారు. టీడీపీ తరుపున ఆదిలాబాద్ పార్లమెంటకు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయనతో పాటు టీడీపీ లో ఉన్న నేతలు టీఆర్ఎస్ లోకి వెళ్లి 2014లో మంత్రి పదవులను కూడా చేపట్టారు. అయితే తాను టీడీపీ లోనే విభజన తర్వాత కూడా ఉండటానికి కారణాలున్నా యంటున్నారు. తనకు టీడీపీ అనేక పదవులను ఇచ్చిందని, ఆ కృతజ్ఞతతోనే తాను టీడీపీని వీడలేదని ఆయన సన్నిహితులతో చెబుతుంటారు.

అన్ని పదవులను పొంది…

అవును నిజమే. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యుడిగా, జిల్లా పరిషత్ అద్యక్షుడిగా, ఎమ్మెల్యేగా అనేక పదవులు టీడీపీ హయాంలోనే రమేష్ రాథోడ్ పొందారు. రమేష్ రాథోడ్ సతీమణి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2014లో ఓటమి తర్వాత రమేష్ రాథోడ్ కు టీడీపీ సీన్ అర్థమయింది. అప్పుడు 2018 ఎన్నికలకు ముందు రమేష్ రాథోడ్ టీఆర్ఎస్ లో చేరారు. కానీ అప్పటికే ఆలస్యమయి పోయింది. టీఆర్ఎస్ లోబలమైన నేతలు అప్పటికే ఆ జిల్లాలో ఎదిగిపోయారు.

అన్న పార్టీలూ అయిపోవడంతో…

టీఆర్ఎస్ కూడా రమేష్ రాథోడ్ ను పట్టించుకోలేదు. ఆయనను పక్కన పెట్టింది. ఖానాపూర్ అసెంబ్లీ టిక్కెట్ ఆశించినా కేసీఆర్ ఇవ్వకపోవడంతో 2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ ఎంపీగా కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అన్ని పార్టీలూ తిరిగిన చరిత్రను ఆయన సృష్టించుకున్నారు. బీజేపీలోకి వెళ్లే పరిస్థితులు లేవు. దీంతో సీనియర్ నేత రమేష్ రాథోడ్ రాజకీయం ముగిసినట్లేనంటున్నారు.

 

Tags:    

Similar News