ఇతగాడి కంటే ఆది బెటరటగా?

ఏదైనా దిగితే కాని లోతు తెలియదు. అంటారు పార్టీలు మారే నేతలకు కూడా నిదానంగానే అసలు విషయం తెలిసి వస్తుంది. జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఇప్పుడు ఆదినారాయణరెడ్డి [more]

Update: 2020-10-27 05:00 GMT

ఏదైనా దిగితే కాని లోతు తెలియదు. అంటారు పార్టీలు మారే నేతలకు కూడా నిదానంగానే అసలు విషయం తెలిసి వస్తుంది. జమ్మలమడుగు నేత రామసుబ్బారెడ్డికి ఇప్పుడు ఆదినారాయణరెడ్డి మంచోడుగా కన్పిస్తున్నారట. ప్రస్తుత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అంటేనే ఆయన మండి పడుతున్నారట. అనవసరంగా వైసీపీలోకి వచ్చానా? అని రామసుబ్బారెడ్డి మదనప డుతున్నారన్నది జమ్మలమడుగు నియోజకవర్గంలో విన్పిస్తున్న తాజా టాక్.

పార్టీ మారి వచ్చినా…..

జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి వర్గాలు దశాబ్దాల పాటు శత్రువులుగా ఉండేవారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరి మంత్రి పదవిని కొట్టేశారు ఆదినారాయణరెడ్డి. అయితే అప్పట్లో ఆదినారాయణరెడ్డి రాకను రామసుబ్బారెడ్డి వ్యతిరేకించినా పార్టీ అధిష్టానం పట్టించుకోలేదు. గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డిపై ఓటమి పాలయిన రామసుబ్బారెడ్డి చివరకు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

నిర్లక్ష్యంతో……

అయితే తనకంటే వయసులోనూ, రాజకీయ అనుభవంలోనూ చిన్నవాడైన సుధీర్ రెడ్డిని కలుపుకోవాలని రామసుబ్బారెడ్డి తొలుత ప్రయత్నించారు. కానీ గత కొద్దినెలలుగా అది సాధ్యపడటంలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా రామసుబ్బారెడ్డిని ఆహ్వానించడం లేదు. అసలు పార్టీలో రామసుబ్బారెడ్డి ఉన్నాడన్న విషయాన్ని కూడా సుధీర్ రెడ్డి గుర్తించడం లేదట. రామసుబ్బారెడ్డి పార్టీలోకి వచ్చినా ఏమాత్రం ఉపయోగం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట.

జగన్ దృష్టికి….

సుధీర్ రెడ్డి తనను నిర్లక్ష్యం చేస్తున్న విషయాన్ని రామసుబ్బారెడ్డి కడప జిల్లాకు జగన్ వచ్చినప్పుడు చెప్పినట్లు తెలిసింది. జగన్ సానుకూలంగానే స్పందించినా సుధీర్ రెడ్డి వైఖరిలో మార్పు లేదని తెలుస్తోంది. దీంతో రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడ్డారని చెబుతున్నారు. వైసీపీలో ఇలాగే కొనసాగితే తనకున్న క్యాడర్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని భావించిన రామసుబ్బారెడ్డి చివరి ప్రయత్నం చేయాలని నిర్ణయానికి వచ్చారని సమాచారం. సుధీర్ రెడ్డిని నియంత్రించలేకపోతే తన దారి తాను చూసుకుంటానని రామసుబ్బారెడ్డి హెచ్చరిక కూడా జారీ చేయనున్నారని తెలుస్తోంది. సుధీర్ రెడ్డికంటే ఆదినారాయణే బెటరని పిస్తున్నాడని రామసుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.

Tags:    

Similar News