ఇక ఈయనకు ఎలా అవకాశమిస్తారు?

జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి రాజకీయం మళ్లీ మొదటికొచ్చినట్లే కన్పిస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా [more]

Update: 2021-07-03 05:00 GMT

జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి రాజకీయం మళ్లీ మొదటికొచ్చినట్లే కన్పిస్తుంది. తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరిన ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పారు. కొత్తగా నియోజకవర్గాలు ఏర్పడితే తప్ప రామసుబ్బారెడ్డికి వైసీపీ టిక్కెట్ రాదు. జమ్మలమడుగు టిక్కెట్ 2024 ఎన్నికలలో తిరిగి సుధీర్ రెడ్డికే ఇస్తానని జగన్ చెప్పారు. రామసుబ్బారెడ్డికి మాత్రం ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

అవకాశం తక్కువే….

అయితే కడప జిల్లాకు చెందిన వారికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవులు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ పదవుల విషయంలో మరోసారి కడప జిల్లాకు అవకాశముంటుందా? అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు ఎమ్మెల్సీగా జగన్ అవకాశమిచ్చారు. ఇటీవల గవర్నర్ కోటాలో కడప జిల్లా ప్రొద్దుటూరు కు చెందిన రమేష్ యాదవ్ కు ఎమ్మెల్సీ పదవిని కేటాయించారు. రామసుబ్బారెడ్డి ఊసు లేదు.

ప్రతిసారీ…..

ఎమ్మెల్సీ పదవి కోసం అనేక మంది ఆశావహులు ఉన్నారు. సీనియర్ నేతలు, పార్టీ కోసం కష్టపడిన వారు ఎదురు చూపులు చూస్తున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. అవి కూడా ఖచ్చితంగా వైసీపీ ఖాతాలోనే పడతాయి. అయితే ఈసారి రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? అన్న ప్రశ్న తలెత్తుతుంది. ప్రతిసారీ కడప జిల్లాకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఇస్తుండటం కూడా పార్టీలో అసంతృప్తి ఉంది.

ఈసారి మాత్రం…..

అందుకే ఈసారి ఎమ్మెల్సీ పదవులను పార్టీ కోసం పనిచేసిన వారికి, సీనియర్ నేతలకు మాత్రమే జగన్ అవకాశమివ్వాలని భావిస్తున్నారు. దీంతో రామసుబ్బారెడ్డికి ఈసారి కోటాలో కూడా ఎమ్మెల్సీ పదవి దక్కనట్లేనంటున్నారు. మరోవైపు రెడ్డి సామాజిక వర్గం కూడా కావడం కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కే ఛాన్స్ లేదన్నది పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం.

Tags:    

Similar News