వాళ్లు అస్పలు ఒప్పుకోవడం లేదటగా?

జమ్మలమడుగు రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. ఇక్కడ రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి రెండు ప్రధాన పార్టీల్లో ఉండి దశాబ్దకాలాల పాటు కీలకంగా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల నుంచి [more]

Update: 2021-05-27 05:00 GMT

జమ్మలమడుగు రాజకీయాలు ఎప్పుడూ హీట్ గానే ఉంటాయి. ఇక్కడ రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి రెండు ప్రధాన పార్టీల్లో ఉండి దశాబ్దకాలాల పాటు కీలకంగా వ్యవహరించారు. మొన్నటి ఎన్నికల నుంచి జమ్మలమడుగులో సీన్ మారిపోయింది. ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరగా, రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి విజయం సాధించారు. అయితే వైసీపీలో ఇద్దరు నేతల మధ్య సయోధ్య సాధ్యమేనా? అన్న సందేహం కలుగుతుంది.

రెండు వర్గాలుగా విడిపోయి….?

రామసుబ్బారెడ్డికి, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా పడటం లేదు. అనేక సందర్భాల్లో రెండు వర్గాలుగా విడిపోయారు. ఒకే సమావేశంలో ఇద్దరూ పాల్గొన్న దాఖలాలు లేవు. బేషరతుగా వైసీపీలోకి వచ్చినప్పటికీ తనను సుధీర్ రెడ్డి పట్టించుకోవడం లేదని రామసుబ్బారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. వీరిద్దరి మధ్య విభేదాలు అనేక సార్లు అధిష్టానం దృష్టికి వెళ్లినా పట్టించుకోలేదు. ఫలితం పంచాయతీ ఎన్నికల్లో కన్పించింది.

అధిష్టానం ప్రతిపాదనతో….?

రామసుబ్బారెడ్డి, సుధీర్ రెడ్డిల మధ్య పోరులో ఆదినారాయణరెడ్డి ప్రయోజనం పొందారు. బీజేపీ 27 పంచాయతీల్లో విజయం సాధించింది. నలభై శాతం ఓట్లను సంపాదించుకుంది. దీంతో ఆదినారాయణరెడ్డి తిరిగి పుంజుకుంటున్నారని భావించిన పార్టీ హైకమాండ్ రామసుబ్బారెడ్డిని పిలిపించి చర్చలు జరిపింది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని, వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్ రెడ్డికే టిక్కెట్ అని తేల్చి చెప్పింది. దీనికి రామసుబ్బారెడ్డి కూడా అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి.

ససేమిరా అంటున్నారట….

కానీ ఇక్కడ ఎమ్మెల్సీ ప్రతిపాదనకు అంగీకరించిన రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు వెళ్లిన తర్వాత అనుచరుల నుంచి తీవ్ర వత్తిడిని ఎదుర్కొంటున్నారని తెలిసింది. టీడీపీ కూడా ఎమ్మెల్సీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వైసీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని, సుధీర్ రెడ్డి మరోసారి గెలిస్తే తమకు జమ్మలమడుగులో స్థానం ఉండదని రామసుబ్బారెడ్డికి సన్నిహితులు కూడా నూరిపోస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయన పునరాలోచనలో పడినట్లు తెలిసింది. జమ్మలమడుగులో వైసీపీ కధ మళ్లీ మొదటికొచ్చినట్లే కన్పిస్తుంది.

Tags:    

Similar News