Cpi : పేరులోనే కాదు మనిషిలోనూ షేడ్స్ ఎక్కువే

ఆంధ్రప్రదేశ్ లో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్లే కనపడుతుంది. ఒకప్పుడు కమ్యునిస్టులు నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించేవారని పేరుంది. కానీ ఇప్పుడు కమ్యునిస్టులు అలా కాదు. వారికి లబ్ది చేకూర్చేవారినే [more]

Update: 2021-10-20 09:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్లే కనపడుతుంది. ఒకప్పుడు కమ్యునిస్టులు నిష్పక్షపాతంగా న్యాయంగా వ్యవహరించేవారని పేరుంది. కానీ ఇప్పుడు కమ్యునిస్టులు అలా కాదు. వారికి లబ్ది చేకూర్చేవారినే నమ్ముకుంటారు. వారి అడుగులకు మడుగులు వత్తుతుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సీపీఐ పరిస్థితి అలాగే ఉంది. సీపీఐ కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ సీపీఐని పక్కా సైకిల్ పార్టీకి అనుబంధ సంస్థగా మార్చేశారనే చెప్పాలి.

పట్టాభి వ్యాఖ్యలపై….

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడులపై రామకృష్ణ స్పందించారు. బాగానే ఉంది. ఖండించడంలో తప్పు లేదు. సోదర పార్టీపై ప్రేమ అనుకోకపోయినా, ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ఎవరూ హర్షించరు. అదే సమయంలో పట్టాభి చేసిన వ్యాఖ్యలపై రామకృష్ణ ఖండించాల్సి ఉంది. అయితే ఆయన ఆ ఊసే మర్చిపోయినట్లున్నారు. అసలు ఈ దాడులు ఎందుకు జరిగాయో కూడా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.

నాలుగు సీట్ల కోసం….

అంటే పట్టాభి వ్యాఖ్యలను రామకృష్ణ సమర్థిస్తున్నారనే అనుకోవాలి. వామపక్ష పార్టీల్లో తొలి నుంచి సీపీఎం కొంత అంశాల వారీగా పోరాటాలు చేస్తున్నా రామకృష్ణ ఆధ్వర్యంలోని సీపీఐ మాత్రం తొలి నుంచి టీడీపీ తోక పార్టీగా మారింది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీతో జత కట్టి జీరో స్థానాలను సంపాదించుకున్నారు. ఇప్పుడు తిరిగి టీడీపీతో పొత్తు పెట్టుకుని ఏదో ఒకటి రెండు స్థానాలతో అసెంబ్లీలో కాలు మోపవచ్చని ఆశిస్తున్నారు.

అసలు విషయాన్ని వదిలి….

ఈ ఆశతో రామకృష్ణ అసలు విషయాలు మర్చిపోతున్నారు. కనీసం ఒక జాతీయ కమ్యునిస్టు పార్టీ ప్రతినిధిగా పట్టాభి వ్యాఖ్యలను ఖండించాలి. అది చేయకుంటే టీడీపీ కార్యాలయాల్లో దాడులను మాత్రమే ఖండించి వెళ్లిపోవడం, అక్కడ పడిన రాళ్లను మీడియాకు చూపి ఇంత అన్యాయమా అని ప్రశ్నించడం చూస్తుంటే ఆయన పేరులోనే కాదు మనిషిలోనూ రెండు షేడ్స్ ఉన్నాయన్నది చెప్పకనే తెలుస్తోంది.

Tags:    

Similar News